Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 25, 2020

Corona vaccine dry run in AP on 28th of this month


 ఈనెల28న AP లో కరోనా టీకా డ్రైరన్



 డ్రై రన్‌కు కృష్ణా జిల్లాను ఎంపిక చేసిన కేంద్రం కరోనా వ్యాక్సిన్​ను వేసేందుకు ముందస్తుగా డ్రై రన్ నిర్వహించాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సిన్‌ వాస్తవ పంపిణీలో సవాళ్లు గుర్తించడమే లక్ష్యంగా డ్రై రన్ నిర్వహించనున్నారు. ‌డిసెంబరు 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అస్సాం, గుజరాత్​లలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది.                

  డ్రైరన్​కు అనుగణంగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 28వ తేదీన  కృష్ణా జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కోసం సిద్ధం కావాల్సిందిగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.             

ఆంధ్రప్రదేశ్​లో తొలివిడత కోటి మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సమాచార సేకరణతో పాటు మౌలిక సదుపాయాలను కూడా సమకూరుస్తున్నారు.


డ్రై రన్ అంటే ఏంటి ? 

టీకా ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లు , టీకా అనంతరం ఎదురయ్యే పరిణామాలను డ్రైరన్ సమయంలో పరిశీలిస్తారు . టీకా ఇవ్వడం మినహా .. అన్ని దశలను పరిశీలించనుండగా , కోల్డ్ స్టోరేజ్ నిర్వహణ , రవాణా ఏర్పాట్లు , సామాజిక దూరం పాటించేలా ప్రజలను అదుపుచేసే విధానం అమలును గమనిస్తారు . టీకాలు వేసే ప్రాంతం వ్యాధి వ్యాప్తికి నిలయం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల అమలును పరిశీలిస్తారు .

Thanks for reading Corona vaccine dry run in AP on 28th of this month

No comments:

Post a Comment