Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 2, 2020

Do you lose weight with yoga?


 యోగాతో బరువు తగ్గుతారా?.. అందులో నిజమెంత?

Do you lose weight with yoga?


కరోనా కాలంలో అందరూ చాలా సమస్యలతో సతమతవుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకోవడం, జీతాల్లో కోతలు లాంటి ఇబ్బందులను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మన జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


ఒత్తిడిని చిత్తు చేయాలన్నా, పునరుత్తేజంతో దూసుకెళ్లాలన్నా యోగా, ధ్యానం లాంటి వాటిని సాధన చేయాలని చెబుతున్నారు. ప్రాచీన భారతీయ విధానమైన యోగాతో మానసికంగా ఉత్తేజితులవ్వడమే కాకుండా శారీరకంగానూ ఫిట్‌‌గా తయారవ్వొచ్చు. బరువు తగ్గడంతోపాటు ఆలోచనల్లో స్పష్టత, స్థిమితంగా నిర్ణయాలు తీసుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు మలైకా అరోరా, శిల్పా షెట్టి కుంద్రా, కంగనా రనౌత్ చాలా సంవత్సరాలుగా యోగా చేస్తున్నారు. రోజువారీ ఫిట్‌‌నెస్‌‌లో యోగాను ఎందుకు చేర్చాలో చెప్పే పలు కారణాల గురించి చర్చిద్దాం..



– మన మూడ్‌‌తోపాటు మెదడు పని చేసే తీరును మెరుగుపర్చడంలో యోగా సాయపడుతుంది. యోగా ఒత్తిడి నుంచి బయటపడేసి సాంత్వన చేకూరుస్తుంది.


– మీ బాడీని ఫిట్‌‌గా మార్చాలనుకుంటే మీ డైలీ రొటీన్‌‌లో యోగాను తప్పక చేర్చాల్సిందే.


– బాడీ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపర్చడంలో యోగా గొప్పగా పని చేస్తుంది. యోగాలోని చాలా ఆసనాలు కండరాలను సాగదీయడంలో విశేషంగా దోహదపడతాయి.


– యోగాలో శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజులు చాలా కీలకం. నిరంతరం బ్రీతింగ్ ఎక్సర్‌‌సైజులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది.


– హై బ్లడ్ ప్రెషర్ (హై-బీపీ)తో బాధపడే వ్యక్తులు యోగా చేయడం మంచిది. యోగాతో రక్త ప్రసరణ మెరుగుపర్చడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. ఇది గుండెకు మంచిది.

Thanks for reading Do you lose weight with yoga?

No comments:

Post a Comment