Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 21, 2020

Good news for power consumers .. Union Minister who issued key regulations ..!


విద్యుత్తు వినియోగదారులకు శుభవార్త .. కీలక నిబంధనలను వెలువరించిన కేంద్ర మంత్రి .. !నిబంధనలు నోటిఫై చేసిన కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌



దిల్లీ: విద్యుత్‌ వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి హక్కులకు రక్షణ కల్పించింది. సేవలు అందించడంలో విద్యుత్తు సంస్థలు విఫలమైతే జరిమానా చెల్లించక తప్పదు. విద్యుత్తు చట్టం-2003 కింద తనకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి తయారుచేసిన ఈ నిబంధనలను కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ సోమవారం విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి రూపొందించిన ఈ నిబంధనలను డిస్కంలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.

* దేశంలోని ప్రతి విద్యుత్తు పంపిణీ సంస్థా కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత కనీస ప్రమాణాల ప్రకారం సేవలు అందించడం తప్పనిసరి.


* వినియోగదారుడి విజ్ఞప్తి మేరకు విధిగా కనెక్షన్‌ ఇవ్వాలి. మెట్రో సిటీల్లో అయితే 7 రోజుల్లో, మున్సిపల్‌ ప్రాంతాల్లో 15 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లో గరిష్ఠంగా కొత్త కనెక్షన్‌ అందించాలి. ప్రస్తుత కనెక్షన్‌లో మార్పులు చేర్పులకూ ఇదే గడువు వర్తిస్తుంది. దరఖాస్తులకు ఆన్‌లైన్‌ వ్యవస్థను అందుబాటులో ఉంచాలి.


* మీటర్‌ లేకుండా కనెక్షన్‌ ఇవ్వడానికి వీల్లేదు. అన్ని మీటర్లు స్మార్ట్‌ ప్రీపేమెంట్‌ మీటర్లు కానీ, కేవలం ప్రీపెయిడ్‌ మీటర్లుకానీ ఉండాలి.


* మీటర్లలో లోపం ఉన్నా, కాలిపోయినా, చౌర్యానికి గురైనా దాని స్థానంలో కొత్త మీటర్‌ ఏర్పాటు చేయాలి.


* బిల్లుల్లో పారదర్శకత ఉండాలి. బిల్లులు ముందస్తుగా చెల్లించే నిబంధనా ఉండాలి. డిస్‌కనెక్షన్‌, రీకనెక్షన్‌ నిబంధనలు అమలుచేయాలి.


* సాధారణ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్తు అందించాలి. వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్తు అందించాలన్నది రాష్ట్రాల విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్లు చెప్పొచ్చు.


* సరఫరాలో అంతరాయ సమయాల గురించి ముందస్తుగా చెప్పాలి. అనుకోకుండా అంతరాయం ఏర్పడితే కారణాలను వివరిస్తూ ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించాలి. పునరుద్ధరణకు ఎంత సమయంపడుతుందో చెప్పాలి.


* డిస్కమ్‌ల సేవా లోపాలకు ఎంత జరిమానా చెల్లించాలన్నది విద్యుత్తు కమిషన్‌ నోటిఫై చేస్తుంది. వినియోగదారుల సేవల కోసం 24×7 పనిచేసేలా కేంద్రీకృత కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.


* ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తారు. గరిష్ఠంగా 45 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలి. సీనియర్‌ సిటిజెన్లకు డిస్కమ్‌లు ఇంటిదగ్గరే దరఖాస్తు సమర్పణ, బిల్లుల చెల్లింపు సేవలు అందించాలి.

Thanks for reading Good news for power consumers .. Union Minister who issued key regulations ..!

No comments:

Post a Comment