Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 2, 2020

High Demand Jobs In India & America!


భారతదేశం & అమెరికాలో అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలు!

'దశ' మార్చే కొలువులివే..

  1.  పది ఉద్యోగాలను ఎంపిక చేసిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌
  2. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధదే తొలి స్థానం
  3. 2025 నాటికి 8.50 కోట్ల కొలువులు పోయినా.. కొత్తగా 9.70 కోట్లు వస్తాయి
  4. నైపుణ్యాలున్న వారు దొరకడం మాత్రం కష్టమే
  5. 'ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌-2020' నివేదికలో వెల్లడి



భవిష్యత్తులో ఏ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ ఉండనుంది? ఏవి ప్రాధాన్యం కోల్పోనున్నాయి? ఈ విషయాలు అందరికీ ఆసక్తికరమే. వచ్చే అయిదేళ్లలో కొలువుల స్థితిగతులపై ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌) 'ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌-2020' పేరిట నివేదికను ఇటీవల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి కొలువుల రూపం, అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమల వ్యూహం తదితర అంశాలపై సర్వే చేసి డిమాండ్‌ పెరిగే 10 కొలువులు, ప్రాధాన్యం కోల్పోయే పదింటి పేర్లను దేశాల వారీగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న కొలువుల్లో మొదటి స్థానం కృత్రిమ మేధ(ఏఐ)దేనని స్పష్టం చేసింది. భారత్‌, అమెరికా దేశాల్లో డిమాండ్‌ ఉన్న వాటిలో సగానికిపైగా ఉద్యోగాలు ఒకటే కావడం గమనార్హం. నూతన సాంకేతికతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 8.50 కోట్ల కొలువులు పోయినా.. కొత్తగా 9.70 కోట్ల ఉద్యోగాలు వస్తాయని నివేదిక పేర్కొంది. అయితే పరిశ్రమల అవసరానికి తగ్గట్లు నైపుణ్యాలున్న వారు లభించరని వెల్లడించింది. యాంత్రీకరణ, సాంకేతికత వినియోగం దిశగా మారే వేగం కరోనా వల్ల రెట్టింపయిందని తెలిపింది. ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెరగాలని 95 శాతం కంపెనీలు కోరుకుంటున్నాయని స్పష్టం చేసింది.

భారత్‌లో అత్యధిక డిమాండ్‌ ఉండే ఉద్యోగాలు!

1. ఏఐ-మెషిన్‌ లెర్నింగ్‌ స్పెషలిస్టులు

2. డేటా అనలిస్ట్‌లు, సైంటిస్టులు

3. ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్టులు

4. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ నిపుణులు

5. బిగ్‌ డేటా అనలిస్టులు

6. ప్రాజెక్టు మేనేజర్లు

7. ఫిన్‌టెక్‌ ఇంజినీర్లు

8. డిజిటల్‌ మార్కెటింగ్‌-స్ట్రాటజీ నిపుణులు

9. సాఫ్ట్‌వేర్‌, అప్లికేషన్స్‌ డెవలపర్లు

10. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నిపుణులు

అమెరికాలోడిమాండ్‌ ఉండే కొలువులు!

1. ఏఐ- మెషిన్‌ లెర్నింగ్‌ స్పెషలిస్టులు

2. డేటా అనలిస్ట్‌లు- సైంటిస్టులు

3. బిగ్‌ డేటా

4. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ నిపుణులు

5. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ నిపుణులు

6. ప్రాసెస్‌ ఆటోమేషన్‌ నిపుణులు

7. ప్రాజెక్టు మేనేజర్లు

8. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్టులు

9. డిజిటల్‌ మార్కెటింగ్‌ వ్యూహ నిపుణులు

10. వ్యాపార అభివృద్ధి నిపుణులు

భారత్‌లో డిమాండ్‌ తగ్గే కొలువులు!

1. పరిపాలన- కార్యనిర్వాహక కార్యదర్శులు

2. సాధారణ, నిర్వహణ మేనేజర్లు

3. అసెంబ్లింగ్‌, ఫ్యాక్టరీ వర్కర్లు

4. అకౌంటింగ్‌, బుక్‌కీపింగ్‌, పేరోల్‌ క్లర్కులు

5. డేటా ఎంట్రీ క్లర్కులు

6. అకౌంటెంట్‌లు, ఆడిటర్లు

7. ఆర్కిటెక్ట్‌లు, సర్వేయర్లు

8. మానవ వనరుల నిపుణులు

9. క్లైంట్‌ ఇన్ఫర్మేషన్‌- కస్టమర్‌ సర్వీస్‌ వర్కర్లు

10. బిజినెస్‌ సర్వీసెస్‌- అడ్మినిస్ట్రేషన్‌ మేనేజర్లు


సవాళ్లకు పరిష్కారం చూపే నైపుణ్యాలు పెంచుకోవాలి

సాంకేతికత వేగంగా మారుతోంది. ఉద్యోగులు నైపుణ్యాలు పెంచుకోవాలని కొద్ది సంవత్సరాలుగా అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా పరిశ్రమలు కూడా వేగంగా మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకే విద్యార్థులు సవాళ్లకు పరిష్కారం చూపే నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇంజినీరింగ్‌ విద్యార్థులు తప్పనిసరిగా కోడింగ్‌ నేర్చుకోవాలి. అందుకు బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే ఆప్టిట్యూడ్‌, కోడింగ్‌, అల్గారిథమ్స్‌ తదితర వాటిపై పట్టు సాధించాలి.


- వెంకట్‌ కాంచనపల్లి, సీఈఓ, సన్‌టెక్‌ కార్ప్‌ శిక్షణ సంస్థ

Thanks for reading High Demand Jobs In India & America!

No comments:

Post a Comment