Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 31, 2020

Release of CBSE Exam Schedule Revealed Union Education Minister


 సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల ,వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి



దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ గురువారం సాయంత్రం‌ ప్రకటించారు. మే 4 నుంచి జూన్‌ 10 వరకు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. జూలై 15న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.


విద్యారంగంపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపడంతో పాటు తాజాగా కొత్త స్ట్రెయిన్‌ కలకలం నేపథ్యంలో ఈ పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అనేకమంది విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని మంత్రిని ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు. పరీక్షలపై సన్నద్ధతకు సమయం ఇచ్చేలా మే నెలలో ఈ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు సరిగా జరగడంలేదని విద్యార్తులు వాపోయారు. దీంతో విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రమంత్రి డాక్టర్‌ రమేశ్‌ పోఖ్రియాల్‌.. మే 4 నుంచి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 6గంటలకు ట్విటర్ లైవ్‌‌లో మాట్లాడిన మంత్రి.. ఈ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Thanks for reading Release of CBSE Exam Schedule Revealed Union Education Minister

No comments:

Post a Comment