Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 8, 2020

SSC CHSL Notification with 4726 posts


 4726 పోస్టులతో ఎస్సెస్సీ సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్‌డీసీ, పీఏ, డీఈఓ పోస్టుల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్‌ నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 15 వరకు అందుబాటులో ఉంటాయి. తాజాగా 4726 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 2017లో 5874 పోస్టులు, 2018లో 5789 పోస్టులను భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 4726

ఇందులో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్ (ఎల్‌డీసీ) లేదా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) 1538 పోస్టులు, పోస్టల్‌ అసిస్టెంట్‌ (పీఏ) లేదా సార్టింగ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 3181, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓ) 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఎల్‌డీసీ లేదా జేఎస్‌ఏ, పీఏ లేదా ఎస్‌ఏ డీఈఓ ఇంటర్‌ పాసై ఉండాలి, కాగ్‌లో డీఈఓ పోస్టుకు ఇంటర్‌లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులు చదివి ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 27 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక విధానం: రాతపరీక్ష

ఇది మొత్తం మూడు విభాగాలు ఉంటుంది. టైర్‌-1లో 100 ఆబ్జెక్టివ్‌ బిట్లు ఉంటాయి. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారిని టైర్‌-2కు, అందులో క్వాలిఫై అయినవారిని టైర్‌-3కి ఎంపికచేస్తారు.

అప్లికేషన్‌ ఫీజు: రూ.100

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 15

టైర్‌-1 పరీక్ష: 2021 ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు

వెబ్‌సైట్‌: : https://ssc.nic.in

Thanks for reading SSC CHSL Notification with 4726 posts

No comments:

Post a Comment