Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 19, 2020

Teacher Transfers - 2020 - New Guidelines


 ఉపాధ్యాయ బదిలీలు - 2020 - నూతన మార్గదర్శకాలు 



 1. ఉపాధ్యాయులు Web Option పెట్టుకొనుటకు గడువు తేది 18-12-2020 తో ముగిసినది .


2. అన్ని Web Option పెట్టిన ఉపాధ్యాయులు తమ Web Option - print నందు సంతకము చేసి సదరు మండల విద్యాశాఖాధికారులకు తేది.19-12-2020 లోగా సమర్పించవలెను .


3. ఆ విధముగా సమర్పించిన Web Option వివరములను సదరు మండల విద్యాశాఖాధికారులు తమ login నందు 21-12-2020 నుండి confirm చేయవలెను . దీనికి గాను విద్యాశాఖాధికారులకు login మరియు pass word లను పంపించబడును . 


4. ఉపాధ్యాయులు ఇంతవరకు ఎవరైనా web option పెట్టనటువంటి వారు సదరు మండల విద్యాశాఖాధికారుల కార్యాలయము నందు తేది . 21-12-2020 నుండి 22-12-2020 లోగా హాజరై వారి యొక్క web option లను నమోదు చేసుకొని Web Option ల print నందు సంతకము చేసి సదరు మండల విద్యాశాఖాధికారులకు సమర్పించవలెను . ఆ విదముగా సమర్పించిన Web Option వివరములను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే తమ login నందు confirm చేయవలెను .


5. ఉపాధ్యాయులు ఎవరైతే తమ web option లను సరిగా నమోదు కాలేదు అని భావించిన వారు తేది . 23-12 2020 నుండి 31-12-2020 వరకు సదరు మండల విద్యాశాఖాధికారుల కార్యాలయము నందు MEO గారి సూచనల ప్రకారము హాజరై web option లను పెట్టుకొని Web Option ల print నందు సంతకము చేసి సదరు మండల విద్యాశాఖాధికారులకు సమర్పించవలెను . ఆ విదముగా సమర్పించిన web Option వివరములను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే తమ login నందు confirm చేయవలెను .


6. ఉపాధ్యాయులు తమ యొక్క web option లను నమోదు | మార్పు చేయునపుడు వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నకు OTP వచ్చును . కావున సదరు రిజిస్టర్ మొబైల్ ను తమ వద్ద అందుబాటులో ఉంచుకొనవలెను .


7. మండల విద్యాశాఖాధికారులు అందరూ ఒక రోజుకు 10 మందిని మాత్రమే తమ కార్యాలయము నందు web option నమోదు చేయుటకు అనుమతించవలెను .


8. అలా అనుమతించిన ఉపాధ్యాయులకు MRC నందు హాజరైన దినమును OD గా నమోదు చేయవలెను . 


9. మండల విద్యాశాఖాధికారులు అందరూ ఖచ్చితముగా తమకు కేటాయించిన login మరియు pass word లను MRC సిబ్బందికి తప్ప ఇతరులకు చెప్పరాదు . 


10. పై ప్రక్రియ మొత్తము కూడా MRC కార్యాలయము నందు మాత్రమే జరుగవలెను . మరి ఎక్కడా కూడా జరుగరాదు . 


11. జిల్లా లోని ఉప విద్యాశాఖాధికారులు అందరూ తమ పరిదిలోని ఉపాధ్యాయులoదరకు పై విషయము తెలియచేసి సదరు మండల విద్యాశాఖాధికారుల కార్యాలయము నందు web ఆప్షన్ల ప్రక్రియ సకాలములో పూర్తి అగునట్లు చర్యలు తీసుకొనవలెను . 


12. పై కార్యక్రమమును సజావుగా నిర్వహించుటకు మండల పరిధిలోని సమర్ధు లైన ఉపాధ్యాయులను లేక CRP లను MRC నందు వినియోగించుకొనవచ్చును . MRC నందు హాజరైన దినములకు వారికి OD గా నమోదు చేయవలెను .


13. ఉపాధ్యాయులు సమర్పించినటువంటి web option ల print లను పుస్తక రూపములో తయారు చేసి జిల్లా కార్యాలయమునకు సమర్పించ వలెను . 


14. పై కార్యక్రమమును తగు జాగ్రత్తలు తీసుకొని 31-12-2020 లోగా పూర్తి చేసి జిల్లా విద్యాశాఖాధికారి గారికి సహకరించవలసినదిగా కోరడమైనది . ఈ కార్యక్రమము వలన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమమునకు ఎలాంటి అంతరాయము కలుగ రాదు .

Thanks for reading Teacher Transfers - 2020 - New Guidelines

No comments:

Post a Comment