Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 3, 2020

WhatsApp new rule..if you do not agree the account will be deleted ..


వాట్సాప్ కొత్త రూల్..ఒప్పుకోకుంటే ఖాతా డిలీట్ ?


‌ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌కు ఉన్నంత మంది యూజర్స్ మరే యాప్‌కు లేరనండంలో ఎలాంటి సందేహంలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌కి మరింత చేరువయింది వాట్సాప్‌. అయితే ఈ సారి కాస్త భిన్నంగా కొత్త అప్‌డేట్‌తో యూజర్స్‌కి షాకివ్వబోతోంది. కంగారు పడకండి... వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 తేదీ నుంచి వాట్సాప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను తీసుకురానుంది. వీటిని అంగీకరించని యూజర్స్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను వాబీటాఇన్ఫో షేర్ చేసింది. అందులో కొత్త నిబంధనలను అంగీకరించండి లేదా మీ ఖాతాను డిలీట్ చేసుకోండి అని ఉంది.

వాబీటాఇన్ఫో స్క్రీన్ షాట్ ప్రకారం వాట్సాప్‌ కొత్త అప్‌డేట్ గురించిన మరింత సమాచారంతో యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఎలా ఉపయోగిస్తుందనేది ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలానే ఫేస్‌బుక్ అందించే అన్ని రకాల సేవలకు సంబంధించిన ఛాటింగ్ సమాచారాన్ని వ్యాపార అవసరాల కోసం ఎలా ఉపయోగిస్తారనేది కూడా అందులో తెలియజేస్తారట. అలానే 2021 ఫిబ్రవరి 8 తేదీ తర్వాత వాట్సాప్‌ ఉపయోగించాలంటే మీరు కొత్త నిబంధనలను అంగీకరించాలి లేదంటే మీ ఖాతా డిలీట్ అవుతుందని అందులో పేర్కొన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత కొద్ది నెలలుగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. ఇందులో వాట్సాప్‌ పేమెంట్స్‌, డిస్‌అపియరింగ్ మెసేజెస్‌, వాట్సాప్ షాపింగ్ బటన్, ఛాట్ వాల్‌పేపర్స్‌, స్టోరేజ్‌ మెనేజ్‌మెంట్ వంటివి ఉన్నాయి.

Thanks for reading WhatsApp new rule..if you do not agree the account will be deleted ..

No comments:

Post a Comment