Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 9, 2020

Will take-home salary go down ...?


 టేక్‌ హోమ్‌ శాలరీ తగ్గనుందా...?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల టేక్‌ హోమ్‌ శాలరీ (నెలవారీ చేతికొచ్చే మొత్తం)లో కోత పడనున్నట్టు సమాచారం. నూతన వేతన నిబంధన- 2019 వల్ల ఈ మార్పు చోటుచేసుకోబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో మూల వేతనాన్ని (బేసిక్‌ పే) 50 శాతంగా నిర్ణయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ మేర గ్రాట్యుటీ చెల్లింపులు, పీఎఫ్‌ వాటా పెరిగి ఏప్రిల్‌ నుంచి టేక్‌ హోం శాలరీ కొంతమేర తగ్గనుంది. నూతన నిబంధనలకు అనుగుణంగా సంస్థలు ఆ మేరకు వేతనాల్లో సవరణలు చేపట్టొచ్చని తెలుస్తోంది. 


అయితే, దీనివల్ల ఉద్యోగి మూల వేతనం పెరుగుతుంది. ఈ నిబంధనల వల్ల ఉద్యోగుల టేక్‌ హోం శాలరీ తగ్గినప్పటికీ.. పదవీ విరమణ సమయంలో వచ్చే ప్రయోజనాలు అధికంగా ఉండనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది. సాధారణంగా ఆయా సంస్థల్లో పనిచేసేవారి మూల వేతనం కంటే అలవెన్సులు అధికంగా ఉండడమే ఇందుకు కారణం.

Thanks for reading Will take-home salary go down ...?

No comments:

Post a Comment