Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 5, 2021

Andhra Pradesh: CM Jagan good news for AP people ..., key announcement on house pattas ..!


 Andhra Pradesh : ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ ... , ఇళ్ల పట్టాలపై కీలక ప్రకటన .. !



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తోంది. గత నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. స్పందన కార్యక్రమంపై ఇళ్ల పట్టాల పంపిణీ తీరుపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు పూర్తైన ఇళ్ల పట్టాల పంపిణీని అడిగి తెలుకున్నారు.దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పంపిణీ ప్రక్రియ ఇప్పటివరకు 39శాతమే పూర్తైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

లబ్ధిదారుడి చేతికే నేరుగా ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.


ఇక పెండింగ్ లో ఉన్న ఇళ్లస్థలాల అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లకు జగన్ సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతి కాలనీ వెలుపల హైటెక్ పద్ధతిలో బస్ స్టాప్ నిర్మించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంటి స్థలం లేని అర్హులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న సీఎం.., అర్హులైన పేదలకు ఇంటిస్థలం రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 30 లక్షల 75 వేల ఇళ్ల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని చోట ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి లే అవుట్లుగా అభివృద్ధి చేసి పేదలకు అందిస్తోంది. లబ్ధిదారుల్లో దాదాపు 10శాతం మందికి కోర్టు కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పంపిణీని ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఆ తర్వాత మరో రెండు దశల్లో మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. మొత్తం 37.50 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.54,940 కోట్లు ఖర్చు చేయనుంది.


ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ఆఫర్లు ఇచ్చింది:


ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు.

ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్‌కి కొంత, పిల్లర్స్‌కి కొంత, స్లాబ్‌కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.

ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.

Official Website Link For more information

Download the Sanction Order Copy Here

Thanks for reading Andhra Pradesh: CM Jagan good news for AP people ..., key announcement on house pattas ..!

No comments:

Post a Comment