Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 12, 2021

Avoid the vaccine if it is on this list


 ఈ జాబితాలో ఉంటే వ్యాక్సిను దూరంగా ఉండండి .. లేకపోతే అంతే .. !

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనాను నిర్మూలించేందుకు వ్యాక్సిన్ రెడీ అయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలకు కూడా ఈ వ్యాక్సిన్ డోసులను కేంద్రం పంపిణీ చేయడం ప్రారంభమైంది. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయనున్నారు. వీరిలో 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్, కోటి మంది పోలీసులు ఉన్నారు. వీరికి తొలిగా వ్యాక్సిన్ అందించే దిశగా కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీరికి విజయవంతంగా వ్యాక్సిన్ అందించిన తరువాత రెండో విడతగా 30 కోట్ల మందికి అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వ్యాక్సిన్ వేయించుకుంటే కొంత మంది అనారోగ్యాలకు రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌కు ఎవరెవరు దూరంగా ఉండాలో ముందుగా ఓ జాబితా తయారు చేసి విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.


హెచ్‌ఐవీ రోగులకు వద్దు..

కరోనా వ్యాక్సిన్‌ను ఎట్టిపరిస్థితుల్లో హెచ్‌ఐవీ రోగులు వేయించుకోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నుంచి హెచ్‌ఐవీ రోగులకు సంబంధించిన పరిమితమైన డేటా మాత్రమే అందుబాటులో ఉందని, అందువల్ల వ్యాక్సిన్ వేసే సమయంలో డాక్టర్లకు కచ్చితంగా తాము హెచ్‌ఐవీ బాధితులైతే వెంటనే తెలియజేయాలని సూచించింది.ఒకవేళ ఎవరైనా ఈ విషయం చెప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వారిలో కరోనా విజృంభించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది

16 ఏళ్ల లోపు వారికి వద్దు..

కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారు కచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన వారై ఉండాలని, అలా కాకుండా ఆ వయసు కంటే తక్కువ ఉండి.. ఇంకా 16 ఏళ్ల లోపు వారికి అసలు వ్యాక్సిన్ వేయవద్దని డాక్టర్లకు డబ్ల్యూహెచ్‌వో సూచించింది. 16 సంవత్సరాలలోపు వారిలో వ్యాక్సిన్‌ను తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చని, అందువల్ల వారిని వ్యాక్సిన్‌కు దూరంగా ఉంచితేనే మంచిదని పేర్కొంది.


అలర్జీలతో బాధపడేవారు..

కొంత మంది వ్యక్తులకు కొన్ని రకాల మందులతో అలర్జీలు ఉంటాయి. అలాంటి వారు కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఒకవేళ అలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ తీసుకుంటే వారిలో అలర్జీ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అలర్జీలతో బాధపడేవారు కచ్చితంగా వ్యాక్సినేషన్ సమయంలో డాక్టర్లకు ఈ విషయం తెలియజేయాలని, దాదాపు వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.


గర్భిణులకు వద్దు..

కరోనా బారిన పడే అత్యంత ప్రమాదకర జాబితాలో గర్భిణులు ఉంటారని, అయినా వారు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ట్రయల్స్ సమయంలో గర్భిణులకు సంబంధించి తగినంత సమాచారం లేనందున వీరు కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడమే ఉత్తతమమని సూచించింది. ఒకవేళ గర్బిణీ హెల్త్‌వర్కర్‌ అయివుంటే, వ్యాక్సిన్ వేసే వైద్యుడితో సంప్రదించి.. అప్పుడు మాత్రమే డోస్ తీసుకోవాలని, దాదాపు దూరంగా ఉండడమే మేలని సూచిస్తోంది.

ఇక బాలింతలకు, ముఖ్యంగా తల్లి పాలిచ్చే బాలింతలు కూడా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా మహిళలు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం 2-3 నెలల పాటు గర్భం దాల్చ వద్దని, అలా దాల్చితే పుట్టబోయే బిడ్డపై ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉండవచ్చని చెబుతున్నారు.

Thanks for reading Avoid the vaccine if it is on this list

No comments:

Post a Comment