Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 3, 2021

Covishield vs Covaxin


కొవిషీల్డ్ వర్సెస్ కొవాగ్జిన్‌ ... ఏ కరోనా టీకా ఎలా పని చేస్తుంది ? దేని రేటు ఎంత ?

Covishield vs Covaxin

న్యూఢిల్లీ : దేశీయంగా రూపొందించిన రెండు కరోనా టీకాలైన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ)  ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైరన్‌లు నిర్వహించారు. కరోనా సమయంలో  ఉచితంగా టీకాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ల గురించి తెలుసుకుందాం..

అభివృది, తయారీ దారులు

కరోనాను అరికట్టేందుకు రూపొందించిన దేశీయ వ్యాక్సిన్‌లలో మొదటిది కొవాగ్జిన్‌.ఈ టీకాను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసిఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ రూపొందించింది.

కొవిషీల్డ్‌ను ఆస్ట్రాజెన్‌కా సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ అభివృద్ధి చేసింది. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారీలో భాగస్వామిగా ఉంది.


వ్యాక్సిన్‌లను ఎలా రూపొందించారు:

చింపాంజీలలో సాధారణ జలుబు(అడినో వైరస్‌)కు కారణమయ్యే వైరస్‌ను, బలహీనంగా ఉన్న దాన్ని సేకరించి కొవిషీల్డ్‌ను రూపొందించారు. ఇది సార్స్‌ కొవిడ్‌ -2 వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. వ్యాక్సిన్‌ వేసిన అనంతరం కరోనావైరస్‌ శరీరంలోకి ప్రవైశించిన వెంటనే.. ఈ స్పైక్‌ ప్రోటీన్‌ యాక్టివేట్‌ అయి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీంతో ఆవైరస్‌ను ఎదుర్కొంటుంది.

కొవాగ్జిన్‌ కరోనా వైరస్‌ను నిష్క్రియాత్మకంగా చేస్తుంది. వ్యాధికి కారణమయ్యే వైరస్‌ను పనిచేయకుండా చేయడం, అంటే చంపడం చేస్తుంది. వైరస్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అనంతరం రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. హెపటైటిస్‌ ఎ, ఇన్‌ఫ్లూయెంజా, పోలియో, రేబిస్‌లు ఈ విధానంలోనే రూపొందించారు. ఇది వైరస్‌ను ఎదుర్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుందని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది.


క్లినికల్‌ ట్రయల్స్‌ , సామర్థ్యం.

కోవీషీల్డ్‌ ఫేజ్‌ 1 క్లినికల్‌ ట్రయల్స్‌లో 23,745 మంది విదేశీయులు పాల్గనగా.. 70.42 సమర్థవంతంగా పనిచేసిందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తన నివేదికలో తెలిపింది. అనంతరం రెండు మూడు క్లినికల్‌ ట్రయల్స్‌ను 18 ఏళ్లు పైబడిన వారితో పాటు 1600 మంది వలంటీర్లపై చేపట్టేందుకు డిసిజిఐ అనుమతిచ్చింది. ఈ ఫలితాలు మొదటి దశ ట్రయల్స్‌తో సరితూగేలా ఉన్నాయని ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సివొ) కంట్రోలర్‌ తెలిపారు.

కొవాగ్జిన్‌ మొదటి రెండు క్లినికల్‌ ట్రయల్స్‌లో 800 మంది పాల్గన్నారని భారత్‌ బయోటెక్‌ సంస్థ తెలిపింది. మూడో ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ దశలో మొత్తం 22,500 మందిపై ప్రయోగిస్తోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ సమర్థవంతంగా, సురక్షితంగా ఉన్నట్లు తేలిందని ఔషద నియంత్రణ సంస్థ తెలిపింది.


ధరలు

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో పాటు 45 ఏళ్ల వయసు పైబడినవారితో కలిపి మొత్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఉచింతంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అనంతరం మిగిలినవారికి, ఇతర దేశాలకు అందుబాటులోకి రానున్నాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సుమారు రూ. 400 ఖర్చుఅవుతుందని సీరం సంస్థ తెలుపగా, కొవాగ్జిన్‌ ధర రూ. 100 కన్నా తక్కువగానే ఉండే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ చెబుతోంది. అయితే ఈ ధరలు ఖరారు కాలేదు.




Thanks for reading Covishield vs Covaxin

No comments:

Post a Comment