డెబిట్ కార్డు మోసాలను నివారించడానికి ఈ జాగ్రత్తలను పాటించండి
దేశ అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు డబ్బును సురక్షితంగా ఉంచే మార్గాలపై కొన్ని సలహాలను అందించింది. ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు మోసాలను నివారించడానికి వినియోగదారులు ఏటీఎం లావాదేవీలను పూర్తి గోప్యతతో నిర్వహించాలని ఎస్‌బీఐ సూచించింది. మీ ఎటిఎం కార్డ్ , పిన్ ముఖ్యమైనవి. మీ డబ్బును సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు పాటించాలని ట్టిట్టర్ ద్వారా వెల్లడించింది.
ఎటిఎంలలో సురక్షిత బ్యాంకింగ్ గురించి ఎస్‌బీఐ కొన్ని చిట్కాలను పంచుకుంది:
1)ఏటీఎం లేదా పీఓఎస్ మెషీన్ వద్ద కార్డును ఉపయోగిస్తున్నప్పుడు కీప్యాడ్‌ను చేతితో మూసేయండి.
2)మీ పిన్ / కార్డ్ వివరాలను ఎప్పుడూ, ఎవరితో పంచుకోవద్దు.
3)మీ కార్డులో ఎప్పుడూ పిన్ రాయకండి.
4)మీ కార్డు వివరాలు లేదా పిన్ అడుగుతున్న సందేశాలు, ఇ-మెయిల్స్ లేదా కాల్స్‌కు స్పందించవద్దు.
5)మీ పుట్టినరోజు, ఫోన్ లేదా ఖాతా నంబర్‌ను మీ పిన్‌గా నంబర్‌గా పెట్టుకోవద్దు
లావాదేవీ రశీదును పారవేయండి లేదా సురక్షితంగా ఉంచండి.
7)లావాదేవీని ప్రారంభించడానికి ముందు సీసీ కెమెరాలను పరిశీలించండి
8)ఏటీఎం లేదా పీఓఎస్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కీప్యాడ్ మానిప్యులేషన్, హీట్ మ్యాపింగ్ గురించి జాగ్రత్త వహించండి.
9)మీ వెనుక నిలబడి ఇతరులు పిన్ చూసే అవకాశం ఉంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
10)లావాదేవీ హెచ్చరికల కోసం ఎస్‌బీఐ ఖాతాలోకి సైన్ అప్ చేయండి.
బ్యాంకు ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రారంభించింది, ఎస్‌బీఐ ఏటీఎంలలో లావాదేవీలు మరింత సురక్షితం. జనవరి 1, 2020 న ప్రవేశపెట్టిన ఈ కొత్త సౌకర్యం, ఏటీఎం కార్డుదారులకు వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటిపి) సహాయంతో నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలో రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు అనధికార లావాదేవీల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మా ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ లావాదేవీలను మరింత సురక్షితంగా చేస్తుంది. మోసాల నుంచి మిమ్మల్ని రక్షించడం ఎల్లప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యత అని బ్యాంకు పేర్కొంది.
Thanks for reading Follow these precautions to avoid debit card fraud
No comments:
Post a Comment