Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 1, 2021

In the final stage..counseling


 తుది దశలో..కౌన్సెలింగ్‌

In the final stage..counseling

♦ఉపాధ్యాయ బదిలీల వెబ్‌ అప్షన్లు పూర్తి

♦మూడు రోజుల్లో తాత్కాలిక సినీయార్టీ జాబితా

♦బదిలీ అయిన వారికి 10లోగా ఉత్తర్వులు జారీ

♦వచ్చిన దరఖాస్తులు 5885.. తప్పనిసరి బదిలీ 2199 మందికి

గుంటూరు(విద్య), జనవరి 1: పాత పద్ధతిలో బదిలీల కౌన్సెలింగ్‌  నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఆందోళ నలు.. పోస్టులు బ్లాక్‌ చేశారని ఆరోపణల మధ్య సుధీర్ఘకా లం సాగిన బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు వచ్చింది. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ డిసెంబరు 31తో ముగిసింది. తాత్కాలిక సినీయార్జీ జాబితాను ఈ నెల 4న విడుదల చేయనున్నారని సమాచారం.  ఈ జాబితాపై వచ్చే అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది జాబితా విడుదల చేసి తరువాత బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జిల్లాలో ఈసారి ఉపాధ్యాయుల బదిలీ కోసం 5885 దర ఖాస్తులు వచ్చాయి. వెబ్‌ అప్షన్లు మాత్రం 5887 వచ్చాయి. ఇందులో గ్రేడు-2 హెచ్‌ఎం, ఎస్జీటీ తెలుగు, ఉర్దూ, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ, సోషల్‌, ఉర్దూ, ఆంగ్లం, హిందీ తదితర క్యాడర్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలో తప్పని సరిగా బదిలీ అయ్యే ఉపాధ్యా యులు 2199 మంది ఉన్నారు. అదేవిధంగా రిక్వెస్టు బదిలీ కోసం దాదాపు 3662 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు జనవరి మొదటి వారంలోనే అత్యధిక కేడర్లు ఉపాఽ ద్యాయులకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 9న నగదు జమ చేయనుంది. దీనికి ముందే బదిలీల ప్రక్రియ ముగించాలని అధికారులు యోచిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తరువాత కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉందని సంఘాల నాయకులు తెలిపారు.

Thanks for reading In the final stage..counseling

No comments:

Post a Comment