Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 27, 2021

Let's work in coordination .. Let's conduct elections smoothly: SEC


సమన్వయంతో పని చేద్దాం .. ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం : ఎస్ఈసీ

Let's work in coordination .. Let's conduct elections smoothly: SEC


 రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమని.. ఆ దిశగా అధికార యంత్రాంగం సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేద్దామన్నారు. ఎన్నికలు సజావుగా నడపడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

ధ్రువ పత్రాల జారీలో తహసీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్ ​హెచ్చరించారు. ప్రచార కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనరాదని.. ఎవరైనా పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమన్వయంతో, సమర్థంగా ఎన్నికలు నిర్వహించుకుందామని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పిలుపునిచ్చారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు

పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికలు సజావుగా సాగాలి

ప్రభుత్వం, క్షేత్ర స్థాయి నుంచి పూర్తి సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఎస్​ఈసీ తెలిపారు. ఉద్యోగులు తరఫున వారిపక్షాన నిలిచిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్యలను స్వాగతిస్తున్నామన్నారు. కొవిడ్ దృష్ట్యా ఎన్నికల ఓటింగ్ సమయాన్ని పెంచామని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగించాలన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు రాజ్యాంగ పరిధికి లోబడి ఎన్నికల కమిషన్ పని చేస్తుందన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనకున్న విశేష అధికారాలను గతంలో గానీ, భవిష్యత్తులో గానీ దుర్వినియోగం చేసే దాఖలాలు జరగబోవన్నారు.

గతం చూడొద్దు

గతం చూడొద్దు.. నేనూ చూడను.. ఎన్నికలు సజావుగా నడపడమే ధ్యేయంగా పనిచేయాలని ఎస్​ఈసీ అన్నారు. అంకితభావంతో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు కుల ఆదాయ ధ్రువ పత్రాల జారీలో అలక్ష్యం చూపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

వాలంటీర్లు వద్దు

రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు సజావుగా సాగేలాగా సహకారాన్ని అందించాలని నిమ్మగడ్డ కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సుమర్థవంతంగా వినియోగించే ఆలోచనతో కమిషన్ ఉందన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక యాప్ ద్వారా ఓటింగ్ ప్రక్రియపై, పోలింగ్ బూత్ లోపల జరిగే అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. వీడియో క్లిప్పింగులను , ఫొటోలను ఎలక్షన్ కమిషన్ రూపొందించిన యాప్ ద్వారా అప్​లోడ్​ చేయవచ్చని తెలిపారు. ప్రత్యేక సెల్ ఎర్పాటు చేసి యాప్ ద్వారా ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించరాదని ఎస్​ఈసీ కీలక నిర్ణయం ప్రకటించారు. వాలంటీర్లు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా తీవ్ర చర్యలు ఉంటాయన్నారు.

వాటిని పరిగణనలోకి తీసుకోం

ఏకగ్రీవాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్న ఆయన.. వీటికి సంబంధించి ఏమైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్ఓ, ఏఆర్​ఓలపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వీలైనంతవరకూ ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకుని సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకంటే దీటుగానే ఏర్పాట్లను చేపడతామన్నారు. ఓటర్లను, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ సమయాన్ని కూడా పొడిగించామన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు కమిషన్ పై తీవ్ర పదజాలంతో మాట్లాడినా వాటిని పరిగణనలోనికి తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పేజ్ -1 లో జరగాల్సిన ఎన్నికలు చివరి విడత నిర్వహిస్తామన్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించుకుందామని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఎవరూ ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందన్నారు. కొవిడ్​ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు బందోబస్తీ బృందాలను ముందుగానే సిద్ధం చేసుకున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయా బృందాలకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే రెండు రోజులు ముందే పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ అందేలాగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్ విభాగం ద్వారా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యా త్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

వ్యాక్సినేషన్​లో మార్పు లేదు

ఎన్నికల సామగ్రి, ఇతర లాజిస్టిక్స్​కు సంబంధించి కలెక్టర్లు ముందస్తుగానే చర్యలు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆదేశించారు. అవసరమైన పోలింగ్ మెటీరియల్, ఫారాలను సిద్ధం చేసుకోవాలని, ప్రింటింగ్​లను స్థానికంగానే సమకూర్చుకోవాలన్నారు. చిన్న, మధ్యతరహా, పెద్ద బ్యాలెట్ బాక్స్​లను ఆయా పోలింగ్ బూత్​లలోని ఓటర్లకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ ప్రోగ్రాం కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్​ కాటంనేని భాస్కర్ తెలిపారు. వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియకు సంబంధించి ఎటువంటి మార్పు లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేస్తామని తదుపరి మాస్క్​, గెజ్​లు ఎన్నికల సిబ్బందికి అందుబాటులో ఉంచుతామన్నారు.

Thanks for reading Let's work in coordination .. Let's conduct elections smoothly: SEC

No comments:

Post a Comment