Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 12, 2021

WhatsApp: WhatsApp update on new message privacy policy .. Most crucial announcement issued


 WhatsApp : కొత్త మెసేజ్ ప్రైవసీ పాలసీపై వాట్సాప్ అప్ డేట్ .. అత్యంత కీలక ప్రకటన జారీ

WhatsApp update: ఫేస్‌బుక్ యాజమాన్యం నిర్వహించే వాట్సాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా యూజర్లు భగ్గుమంటున్నారు. కొత్త పాలసీ వల్ల వ్యక్తుల వ్యక్తిగత వివరాలన్నీ బయటకు వచ్చేస్తాయనీ... పంపించిన మెసేజ్‌ల డేటా అంతా అందరికీ తెలిసిపోతుందనీ భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంటే... కోట్ల మంది వాట్సాప్‌కి గుడ్‌బై చెప్పి... ఆల్టర్నేట్ యాప్స్ వైపు వెళ్తున్నారు. ఈ ప్రచారంపై వాట్సాప్ స్పందించింది. అనవసరమైన రూమర్లు వస్తున్నాయనీ... ఇవేవీ నిజం కాదని తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీ వల్ల యూజర్ల ప్రైవసీ, వారి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ప్రైవసీ ఏవీ కూడా దెబ్బతినవు అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులతోపాటూ...ప్రముఖులు కూడా వాట్సాప్‌ని వదిలేయమని ప్రకటనలు చేస్తుండటంతో... వాట్సాప్ తన బ్లాగ్‌లో ఇలా రాసింది.

"మేము ఈ మధ్య మన ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేశాం. దాంతో మాకు చాలా మంది నుంచి చాలా రకాల ప్రశ్నలు, అనుమానాలు వచ్చాయి. కొన్ని రకాల రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మేము అందుకున్న ప్రశ్నల్లో... కొన్ని కామన్ ప్రశ్నలకుమేము ఆన్సర్ ఇవ్వాలనుకున్నాం. ప్రజలు వ్యక్తిగతంగా ఒకరి నుంచి ఒకరు సమాచారం పొందడానికి వాట్సాప్‌ని గొప్ప వేదికగా మేం తయారుచేశాం. మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. కొత్తగా అప్‌డేట్ చేసిన ప్రైవసీ పాలసీ వల్ల... మీ ఎవరి వ్యక్తిగత ప్రైవసీపైనా ప్రభావం పడదు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ సభ్యులు, ఇంకెవరికైనా మీరు పంపే మెసేజ్‌ల ప్రైవసీ దెబ్బతినదు. దానికి బదులుగా వాట్సాప్‌లో వ్యాపార కోణంలో పంపే మెసేజ్‌లకు అప్‌డేట్ వర్తిస్తుంది. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. మేం ఎలా డేటా సేకరిస్తామో, ఎలా దాన్ని వాడుతామో... మరింత పారదర్శకంగా వివరిస్తున్నాం" అని తెలిపింది.వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని ప్రకటించినప్పుడు... దీనిపై ఎవరికీ క్లారిటీ రాలేదు. దంతో... వాట్సాప్... యూజర్ల ప్రైవేట్ చాట్‌ను వాడేసుకుంటుందనీ, కలెక్ట్ చేసుకుంటుందనీ... అలాగే చాటింగ్ మధ్యలో యాడ్స్ వేస్తుందనీ ఇలా చాలా ప్రచారాలు నడిచాయి, నడుస్తున్నాయి. ఫలితంగా చాలా మంది వాట్సాప్ వదిలేసి సిగ్నల్ లాంటి ఇతర యాప్‌ల వైపు వెళ్లిపోయారు.

తాజాగా వాట్సాప్ చెప్పిన దాని ప్రకారం... యూజర్ల వ్యక్తిగత మెసేజ్‌లను వాట్సాప్ చూడదు. అలాగే యూజర్ల కాల్స్ కూడా వాట్సాప్ వినదు. ఫేస్‌బుక్ కూడా ఇలా చెయ్యదు. అలాగే... ఎవరు ఎవరితో చాట్ చేస్తున్నారో, ఎవరికి కాల్ చేస్తున్నారో... ఇలాంటి డేటా ఏదీ సేకరించదు. అంతేకాదు... మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ చూడవు. మీ కాంటాక్ట్ లిస్టును వాట్సాప్... ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యదు. వాట్సాప్ గ్రూపులు కూడా ప్రైవేట్‌గానే ఉంటాయి. వాటిని ఎక్కడా బయటపెట్టదు. "మేము గ్రూప్ మెసేజ్‌లను ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యము. అలాగే... యాడ్స్ కోసం కూడా వాటిని వాడుకోము. ప్రైవేట్ చాట్స్ ఎప్పటిలాగే... ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (పంపేవారూ, మెసేజ్ చేరిన వారు మాత్రమే చూసే ఛాన్స్) ఉంది. కాబట్టి మేము ఎవరి డేటా, కంటెంటూ చూడము" అని వాట్సాప్ తన బ్లాగ్‌లో తెలిపింది.

వాట్సాప్ తాజాగా పంపిన ప్రైవసీ పాలసీ... ఫిబ్రవరి 8, 2021 నుంచి అమల్లోకి వస్తుంది. వాట్సాప్ వాడాలనుకునేవారు ఈ కొత్త పాలసీని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒప్పుకోకపోతే... వారికి ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ సేవలు అందవు.

Thanks for reading WhatsApp: WhatsApp update on new message privacy policy .. Most crucial announcement issued

No comments:

Post a Comment