Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 4, 2021

IBPS Exam Calendar 2021-22: Good news for the unemployed ... this is the IBPS exam calendar


 IBPS Exam Calendar 2021-22 : నిరుద్యోగులకు శుభవార్త ... ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ ఇదే

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్‌లు, ఆఫీసర్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్స్, ప్రొబెషనరీ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS పరీక్షల్ని నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా ముందుగానే ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం 2021-22 సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది

మరి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో, ఏఏ తేదీల్లో పరీక్షలు జరుగుతాయో తెలుసుకోండి.

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్- 2021 ఆగస్ట్ 1, 7, 8, 14, 21

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్- 2021 సెప్టెంబర్ 25

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్- 2021 సెప్టెంబర్ 25

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్- 2021 అక్టోబర్ 3

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్- 2021 ఆగస్ట్ 28, 29, సెప్టెంబర్ 4, 5

ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్- 2021 అక్టోబర్ 31


ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్- 2021 అక్టోబర్ 9, 10, 16, 17

ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్- 2021 నవంబర్ 27


ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్- 2021 డిసెంబర్ 18, 26

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్- 2022 జనవరి 30

ఈ పరీక్షలన్నింటికీ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ పద్ధతిలోనే ఉంటుంది. అభ్యర్థులు ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర, చేతిరాతతో రాసిన డిక్లరేషన్ కాపీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్లలో ఉంటాయి. పరీక్షకు ఒకట్రెండు నెలల ముందే డీటెయిల్డ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది ఐబీపీఎస్. మరిన్ని వివరాల కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఫాలో కావాలి.

Thanks for reading IBPS Exam Calendar 2021-22: Good news for the unemployed ... this is the IBPS exam calendar

No comments:

Post a Comment