Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 25, 2021

Kovid 2.0: Lock down again ....?


 కోవిద్2.0: మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా ....?

Kovid 2.0: Lock down again ....?

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రాలు స్థానికంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు నిబంధనలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏంటి? మళ్లీ లాక్​డౌన్​ విధించే అవకాశం ఉందా?


దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతున్నట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదకొండు నెలల క్రితం విధించిన లాక్​డౌన్​ పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి.

సెప్టెంబర్ నెల మధ్యలో రోజుకు సగటున 90 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కరోనా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి 1న అత్యంత తక్కువగా.. 8,635 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది నెలల్లో అదే అత్యల్పం. కానీ, ఇటీవల కేసుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. ప్రతిరోజు సగటున 12-16 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.ఏంటి? మళ్లీ లాక్​డౌన్​ విధించే అవకాశం ఉందా?


దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతున్నట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదకొండు నెలల క్రితం విధించిన లాక్​డౌన్​ పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి.


సెప్టెంబర్ నెల మధ్యలో రోజుకు సగటున 90 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కరోనా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి 1న అత్యంత తక్కువగా.. 8,635 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది నెలల్లో అదే అత్యల్పం. కానీ, ఇటీవల కేసుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. ప్రతిరోజు సగటున 12-16 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. 

కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు

amaravati lockdown లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా అమరావతి(మహారాష్ట్ర) రోడ్లుఈ రాష్ట్రాల్లో ఆంక్షలు..మహారాష్ట్రలోని పుణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది. అమరావతి జిల్లాలో వారంరోజుల పాటు పూర్తి లాక్​డౌన్​ విధించింది. మార్చి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాజకీయ, మతపరమైన ర్యాలీలతో పాటు.. ప్రజలు గుమికూడే కార్యక్రమాలపైనా నిషేధం అమలవుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. 

పలు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో బంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

 మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించి అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ సర్కార్ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో వచ్చేవారికి ఈ నిబంధన వర్తించనుంది. కారుల్లో వచ్చేవారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. కరోనా నెగెటివ్​ రిపోర్టు చూపించనివారికి అక్కడే పరీక్షలు నిర్వహించి... పాజిటివ్​గా తేలితే 14 రోజుల పాటు క్వారెంటైన్​కు పంపిస్తారు.

పెళ్లి మండపాల్లో కరోనా వ్యాప్తి నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. మండపాల్లో మార్షల్స్​ను ఏర్పాటు చేసింది. ప్రజలు కొవిడ్​ మార్గదర్శకాలు పాటించేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.అధిక కేసులకు కారణం?కనీస నిబంధనలను విస్మరించడమే కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

 సమూహాలుగా ఏర్పడటం, మాస్కులు సరిగా ధరించకపోవడం వంటి కారణాలే ప్రధానంగా వినిపిస్తున్నాయిఈ నేపథ్యంలో కొవిడ్ ముప్పు ఇప్పుడే తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన కరోనా పూర్తిగా కనుమరుగైనట్లు కాదని చెబుతున్నారు. ఈ సంవత్సరం మొత్తం కరోనా ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం చర్యలు

కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ఏడు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కఠినమైన నియంత్రణా చర్యలతో పాటు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలను పెంచుతూ వైరస్​లో జన్యుమార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలను కేంద్ర సర్కార్ కోరింది. యాంటీజెన్​ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన కేసులను మళ్లీ ఆర్​టీపీసీఆర్​ ద్వారా పరీక్షించాలని సూచించింది. కరోనా వాక్సిన్​ పంపిణీలో వేగం పెంచాలని స్పష్టం చేసింది.

లాక్​డౌన్ ఉంటుందా?

రోజువారీ కేసుల సంఖ్య పెరగడానికి కొత్త స్ట్రెయిన్ కారణం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నివారించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసులను అరికట్టేందుకు లాక్​డౌన్​ను ఆశ్రయించే అవకాశాలు లేవని అంటున్నారు.తమ రాష్ట్రంలో లాక్​డౌన్ విధించేది లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు కూలీలు, వలస కార్మికులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం లాక్​డౌన్ ప్రణాళికలు ఏవీ లేవని ముంబయి మున్సిపల్ కమిషనర్ సైతం తేల్చిచెప్పారు. లాక్​డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందని శివసేన సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను సామ్నా పత్రికలో ప్రస్తావించింది.

Thanks for reading Kovid 2.0: Lock down again ....?

No comments:

Post a Comment