అలర్ట్ : బ్యాంకులకు వరుస సెలవులు
మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. లేకపోతే మీరు బ్యాంకు పనుల కోసం ఏప్రిల్ 3 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకు కార్యాలయము పనిచేస్తాయి. కాబట్టి, బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. మార్చి 27న చివరి శనివారం, మార్చి 28న ఆదివారం, మార్చి 29న హోలీ పండుగ ఇలా మూడు రోజులు వరుస సెలవులు ఉన్నాయి. తర్వాత మార్చి 30న పాట్నాలో హాలిడే ఉంది. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు.
అలాగే ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్ పనిలో ఉంటాయి. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పని చేయవని చెప్పుకోవచ్చు. దీని వల్ల మీకు బ్యాంకులో పని ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ నెలలో చాలా సెలవులు వచ్చాయి. మార్చి 15-16 తేదీలలో బ్యాంకుల ప్రైవేటీ కరణకు నిరసనగా రెండు రోజులు పాటు బ్యాంకులు పనిచేయలేదు.
Bank Holidays in April 2021 : ఏప్రిల్ లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే....
న్యూఢిల్లీ: వచ్చేనెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 14 రోజులు మూతపడే ఉంటాయి. ఈ సంగతిని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) హాలీడే క్యాలెండర్ పేర్కొంది. ఇందులో ఎనిమిది రోజులు వివిధ పండుగల సెలవులు కాగా, ఏప్రిల్ ఒకటో తేదీ బ్యాంక్ క్లోజింగ్ డే, నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, నిత్యం వచ్చే సెలవులే. ఇక మార్చి 27-29 మధ్య నాలుగో శనివారం, ఆదివారం, హోలీ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు. ఈ నెల 31వ తేదీన బ్యాంకులు తిరిగి పని చేస్తున్నాయి. కానీ ఆ రోజు కస్టమర్లకు సాధారణ సేవలు ఉండబోవు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు కావడమే దీనికి కారణం.
ఏప్రిల్‌లో బ్యాంకు సెలవులిలా..
ఏప్రిల్ 1న వార్షిక ఖాతాల ముగింపు, 2న గుడ్ ఫ్రైడే, 4న ఆదివారం, 5న బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి, 10న రెండో శనివారం, 11న ఆదివారం, 13న గుడి పడ్వా/తెలుగు సంవత్సరాది/ఉగాది, 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి /తమిళ సంవత్సరాది, 15న హిమాచల్ డే/బెంగాల్ సంవత్సరాది, 16న బొహాగ్ బిహు (అసోం అంతటా సెలవు), 18న ఆదివారం, 21న శ్రీరామ నవమి, 24న నాల్గవ శనివారం, 25న ఆదివారం.
Thanks for reading Alert: Consecutive holidays for banks- Bank Holidays in April 2021


No comments:
Post a Comment