Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 8, 2021

Does forgetfulness hurt? .. But you should check this once ..


 మతిమరుపు బాధిస్తోందా?.. అయితే మీరు ఈ విషయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి..

స్లీప్ ఆప్నియా లేనివారితో పోల్చితే ఉన్నవారిలో జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు తగ్గేందుకు కాగ్నిటివ్ టెస్టుల్లో తక్కువ స్కోర్ చేసేందుకు 60 శాతం కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ అధ్యయనం లో తేలింది.

మనం నిద్రపోయే సమయంలో మన శరీరంలో ఎన్నో పనులు జరుగుతుంటాయి. శరీరంలోని అన్ని కణాల రిపేర్ నిద్రలోనే జరుగుతుంది. మనం బరువు పెరగడం, తగ్గడం, పొడవు పెరగడం లాంటివి కూడా నిద్రలోనే జరుగుతాయి. మన శరీర అవయవాల ఆరోగ్యం కూడా మన నిద్రపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే తరచూ నిద్రలోంచి లేచే వారికి మతిమరుపు బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ అని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా తో బాధపడే వారికి నిద్రపోయే సమయంలో తరచూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటివారిలో మతిమరుపు లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయట. ఇది వయసు పైబడిన కొద్దీ  ఇది ఎక్కువవుతుందని కూడా వారు నిర్ధారించారు. మతిమరుపు సమస్యతో బాధపడుతున్న చాలామందికి స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఈ అధ్యయానాన్ని నిర్వహించిన పరిశోధకులు మార్క్ బౌలోస్ వెల్లడించారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి చెందిన బృందం స్లీప్ ఆప్నియా, మెదడు పనితనం మధ్యనున్న సంబంధం గురించి అధ్యయనం నిర్వహించారు.

స్లీప్ డిజార్డర్లతో బాధపడుతున్న వారందరిలో జ్ఞాపకశక్తి కి సంబంధించిన సమస్యలు ఎదురైనట్లు తాము గుర్తించామని.. దీన్ని గుర్తించడం వల్ల స్లీప్ ఆప్నియా వల్ల ప్రభావాల గురించి తెలుసుకోగలిగామని పరిశోధకులు తెలిపారు. వీరికి చికిత్స అందించడం ద్వారా జ్ఞాపకశక్తి పెరగడానికి తద్వారా వారి జీవితం సులువుగా మారేందుకు సహాయం చేయగలిగామని వారు వెల్లడించారు. ఈ అధ్యయనంలో సుమారు 73 సంవత్సరాలకు అటు ఇటుగా ఉన్న 67 మంది వ్యక్తులను పరిశీలించారు. వీరందరిలో జ్ఞాపకశక్తి కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వారందరూ తమ నిద్ర, జ్ఞాపకశక్తి, తమ మానసిక స్థితి గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం అందించారు. దీని ద్వారా వారందరిలో మతిమరుపు లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఇందులో 52 శాతం మందికి స్లీప్ ఆప్నియా ఉన్నట్లుగా గుర్తించారు.

స్లీప్ ఆప్నియా లేనివారితో పోల్చితే ఉన్నవారిలో జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు తగ్గేందుకు కాగ్నిటివ్ టెస్టుల్లో తక్కువ స్కోర్ చేసేందుకు 60 శాతం కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ అధ్యయనం లో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ఏప్రిల్ 17 నుంచి 22 వరకూ వర్చువల్ గా జరగనున్న అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యాన్యువల్ మీటింగ్ లో  పంచుకోనున్నారు.

స్లీప్ ఆప్నియా ఎంత తీవ్రంగా ఉంటే బాధితుల్లో మతిమరుపు, ఇతర సమస్యలు అంత ఎక్కువగా ఉంటాయని.. ఇది నిద్రపోయే సమయం, ఎంత నాణ్యమైన నిద్ర అందుతోంది, వారు ఎంత తొందరగా నిద్రలోకి జారుకుంటున్నారు వంటి విషయాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మతిమరుపు ఇతర మెదడుకు సంబంధించిన సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికీ స్లీప్ ఆప్నియాకి సంబంధించిన పరీక్ష చేయాలని ఒకవేళ ఇదే వారిలో మెదడు పనితీరు లోపాలకు కారణమైతే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ ద్వారా వారి శ్వాస నాళాలు మూసుకుపోకుండా తద్వారా వారికి మధ్యలో నిద్ర నుంచి మెలకువ రాకుండా సహాయపడే వీలుంటుంది. అయితే ఈ థెరపీ తీసుకునే వారు దాన్ని రెగ్యులర్ గా ఉపయోగించాల్సి ఉంటుంది అంటూ వివరించారు ఈ అధ్యయనకారులు.

Thanks for reading Does forgetfulness hurt? .. But you should check this once ..

No comments:

Post a Comment