Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 21, 2021

For domestic and foreign education .. Learn about the way to receive education loan ..!


 స్వదేశీ, విదేశీ విద్యకు.. విద్యారుణం అందుకునే మార్గం గురించి తెలుసుకోండిలా..!

కళ్ల ముందు కలల కోర్సులు ఎన్నెన్నో! ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బంగారమవుతుందనే భావన! కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే ఆలోచన! కానీ.. చాలామందికి ఆర్థిక పరిస్థితులు వెనక్కులాగుతుంటాయి!

రూ.లక్షల్లో ఫీజులు చూసి.. అర్హతలు, అవకాశం ఉన్నా.. నిరాశతో వెనుకంజ వేస్తున్న వైనం! ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు చక్కటి మార్గం.. ఎడ్యుకేషన్‌ లోన్స్‌!! ప్రస్తుతం పలు బ్యాంకులు.. విద్యారుణాలు అందిస్తూ.. విద్యార్థుల కెరీర్‌ ఉన్నతికి దోహదపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యా రుణాలు, అర్హతలు, విధి విధానాలపై విశ్లేషణ..

బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేయాలంటే.. కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు; గరిష్టంగా రూ.15 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదే విదేశీ విద్యకు వెళ్లాలంటే.. సగటున రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఫీజుల భారం కారణంగా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌.. విద్యార్థులకు విద్యా రుణాలు అందించే ఏర్పాట్లుచేశాయి. విద్యా రుణాలు దేశంలోని గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూ ట్‌లలో,కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికే కాకుండా.. విదేశీ విద్యకు వెళ్లే ప్రతిభావంతులు కూడా అందుకునే అవకాశం ఉంది.

ఇన్‌స్టిట్యూట్‌కు, కోర్సుకు గుర్తింపు..

విద్యా రుణాలను అందిస్తున్న బ్యాంకులు.. కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. బ్యాంకుల విధి విధానాల ప్రకారం–ఏఐసీటీఈ, యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది.

ఎంట్రన్స్‌లో అర్హత సాధిస్తేనే..

విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంటే.. ఏదైనా ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి.. కన్వీనర్‌ కోటాలో సీటు పొందిన వారికే విద్యా రుణ దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఎంట్రన్స్‌లో మెరిట్‌ పొందిన వారికే విద్యారుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు మాత్రం మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి.

గరిష్టంగా రూ.10లక్షలు, రూ.20లక్షలు..

విద్యా రుణాల మంజూరు, గరిష్ట రుణ మొత్తం విషయంలో ప్రస్తుతం బ్యాంకులు రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి.

దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నాయి.

విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు రుణం లభిస్తోంది.

అవసరమైతే హామీలు..

విద్యా రుణాలను బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానంలో మంజూరు చేస్తున్నాయి.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న శ్లాబ్‌(రుణ మొత్తం) ఆధారంగా.. భవిష్యత్తులో రీపేమెంట్‌ పరంగా ముందుగానే కొన్ని హామీ పత్రాలు ఇచ్చే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి.

శ్లాబ్‌–1 ప్రకారం– రూ.4 లక్షలు రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.

శ్లాబ్‌–2 ప్రకారం– రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్‌ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

శ్లాబ్‌–3 విధానం ప్రకారం– రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం లభిస్తోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్‌ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది.

మార్జిన్‌ మనీ చెల్లింపు..

ఎడ్యుకేషన్‌ లోన్‌ కోరుకునే విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్‌ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్‌ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో విద్యకు అయిదు శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్‌ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

రుణం లభించే వ్యయాలు..

◆ట్యూషన్‌ ఫీజు

◆హాస్టల్‌ ఫీజు

◆ఎగ్జామినేషన్‌/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు

◆విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు

◆పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్‌ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం

◆కంప్యూటర్‌ కొనుగోలు వ్యయం

◆కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ తదితరాలకు అయ్యే ఖర్చు రుణంగా లభిస్తుంది.

◆ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్‌ డిపాజిట్, బిల్డింగ్‌ ఫండ్, రిఫండబుల్‌ డిపాజిట్‌లకు కూడా రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్‌ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి.

◆కంప్యూటర్‌ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్‌ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది.

Thanks for reading For domestic and foreign education .. Learn about the way to receive education loan ..!

No comments:

Post a Comment