Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 15, 2021

New Rules from April 1 ..


 ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ ....

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడంతోపాటు దేశంలో వినియోగ డిమాండ్ పెంపొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల ఒకటో తేదీన ప్రతిపాదించిన 2021-22 వార్షిక బడ్జెట్‌తో వివిధ రూపాల్లో ఆదాయం పన్ను (ఐటీ) మార్గంలో సగటు భారతీయుడి ప్యాకెట్‌కు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్న నూతన వేజ్‌కోడ్ బిల్లు-2021తో ఉద్యోగుల వేతన స్ట్రక్చర్‌లో సమూల మార్పులు, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌, ఐటీఆర్ ఫైలింగ్‌లో ఎల్టీసీ ఓచర్ల దాఖలు తదితర రూపాల్లో పన్ను వసూళ్లు, మినహాయింపులు ఉంటాయి.

2021 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రధాన పన్ను సంస్కరణలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిగా అమలులోకి రానున్నాయి.

ఐటీఆర్ ఫైలింగ్‌లో పలు మార్పులు, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై పన్ను నిబంధనలను అమలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, ఆ మార్పులేంటో ఒకసారి చూద్దామా..!


శాలరీ స్ట్రక్చర్‌: న్యూ వేజ్ కోడ్ వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలైతే మొత్తం ఉద్యోగుల వేతనంలో కనీసం 50 శాతం పెరుగుతాయి. దీని ప్రకారం అత్యధిక కంపెనీలు తమ ఉద్యోగుల కనీస వేతనం సుమారు 35-40 శాతం పెంచనున్నాయి. నూతన రూల్ అమలులోకి వస్తే మీ స్థూల వేతనం కూడా పెరుగుతుంది.

పీఎఫ్‌లో కంట్రిబ్యూషన్‌: ఇప్పటికైతే ప్రతి ఉద్యోగి కనీస వేతనంలో 12 శాతం పీఎఫ్ కింద కట్ అవుతుంది. ఉద్యోగి కనీస వేతనం కనీసం 50 శాతం పెరిగితే.. తదనుగుణంగా పీఎఫ్‌లో ఉద్యోగి కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మీ స్థూల వేతనం రూ.40 వేలు ఉంటే, రూ.20 వేల వేతనం పెరుగుతుంది. ఇందులో రూ.2,400 పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.

గ్రాట్యూటీ రూల్‌: న్యూ కార్మిక చట్టాలు అమలులోకి రావడంతో గ్రాట్యూటీలోనూ నూతన నిబంధనలు అమలులోకి వస్తాయి. దీని ప్రకారం ఒక సంస్థలో ఉద్యోగి ఐదేండ్లు పని చేసిన తర్వాత గ్రాట్యూటీ పొందేందుకు అర్హులు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఒక సంస్థలో ఏడాది పాటు పని చేస్తే గ్రాట్యూటీ పొందడానికి అర్హత సాధిస్తారు.

ఎల్టీసీ మినహాయింపు: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) స్కీమ్‌లో మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వోద్యోగులు 2020 అక్టోబర్ 12- 2021 మార్చి నెలాఖరు వరకు ఎల్టీసీ కింద మినహాయింపులు పొందొచ్చు. ఎల్టీసీ స్థానే 12 శాతం అంతకంటే ఎక్కువ క్యాటగిరి జీఎస్టీ వర్తించే వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎల్టీసీ మినహాయింపు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రద్దు కానున్నది.

ఈపీఎఫ్‌వో కంట్రిబ్యూషన్‌పై పన్ను: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో)లో ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తం ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే.. దానిపై వచ్చే వడ్డీమీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనే ఈ సంగతి చెప్పారు. కనుక ఉద్యోగి ఈపీఎఫ్‌వోలో ఏడాదిలో తన వాటా మొత్తం రూ.2.5 లక్షలు దాటితే.. దాటిన మొత్తం సొమ్ముకు వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సిందే.

సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ ఫైలింగ్‌: 75 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఏకైక ఆదాయ మార్గం వారి పెన్షన్ మాత్రమే. కనుక సదరు పెన్షన్‌పై వారికి వచ్చే వడ్డీ మీద పన్ను మినహాయింపు ఉంది. సంబంధిత సీనియర్ సిటిజన్ షరతులకు అనుగుణంగా ఆయా ఐటీఆర్ ఫైలింగ్ చేస్తేనే ఈ మినహాయింపు లభిస్తుంది. బ్యాంకులో డిపాజిట్ అయిన పెన్షన్‌పై వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను రాయితీనిస్తారు.


ఐటీఆర్ ఫైల్ చేయకుంటే అధిక టీడీఎస్‌: ఐటీఆర్ ఫైలింగ్ చేయని వారి ఆట కట్టించేందుకు ఆదాయం పన్ను చట్టంలో ప్రత్యేకంగా 206ఏబీ సెక్షన్ చేర్చారు. ఐటీఆర్ ఫైలింగ్‌లో విఫలమైన వారిపై అధిక టీడీఎస్ వడ్డించేలా నిబంధన చేర్చారు. దీనికి తోడు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ముందస్తుగా ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చు. ఐటీఆర్‌ను సులభతరం చేయడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.

Thanks for reading New Rules from April 1 ..

No comments:

Post a Comment