Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 21, 2021

Telangana PRC: Good news for Telangana employees .. for PRC announcement finalized ..


 Telangana PRC : తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త .. పీఆర్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు ..


హైదరాబాద్: పీఆర్సీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తైంది.ఈ నేపథ్యంలో పీర్సీసీకి ఈసీ ఆదివారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 31న ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే త్రిమెన్ కమిటీ చేసిన పీఆర్సీ సిఫారసులు లీక్ కావవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఉద్యోగులు ఆందోళన చేశారు.

ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు.ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.పోలింగ్ కు వారం రోజుల ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ పీర్సీతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. ఇవాళ ఉదయం ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత పీఆర్సీ అమలు విషయమై ఈసీతో రాష్ట్రప్రభుత్వ అధికారులు చర్చించారు.పీఆర్సీ అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈసీ తెలిపింది. అయితే అవనసర ప్రచారం చేయరాదని సూచించింది.మరోవైపు రాజకీయ లబ్దికి ప్రయత్నం చేయవద్దని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ కు లేఖ రాశారు.

EXPECTED NEW BASIC PAY IN PRS-2018 (FITMENT 30% to 45%)


Thanks for reading Telangana PRC: Good news for Telangana employees .. for PRC announcement finalized ..

No comments:

Post a Comment