Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 4, 2021

Today SBI Mega E-Auction


 నేడు ఎస్​బీఐ మెగా ఈ-వేలం

నేడు ఎస్​బీఐ ఈ-వేలం నిర్వహించనుంది. తాకట్టులో ఉన్న పలు ఆస్తులను వేలం వేయనుంది. అన్నిరకాల ప్రాపర్టీలను విక్రయించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. నివాస ప్రాంగణాలు, గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి వీటిల్లో ఉన్నట్లు ట్విట్టర్​లో పేర్కొంది.

తాకట్టులో ఉన్న పలు ఆస్తులను ఎస్‌బీఐ నేడు(మార్చి 5) ఈ-వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్‌ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ వేలంలో అన్నిరకాల ప్రాపర్టీలను విక్రయించనున్నట్లు తెలిపింది. నివాస ప్రాంగణాలు, గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి వీటిల్లో ఉన్నట్లు ఎస్‌బీఐ గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ఎవరైనా ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలను పలు ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇక తాకట్టులో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆయా బ్రాంచిల్లో సంబంధిత అధికారుల వివరాలను కూడా ఇచ్చింది.

బిడ్‌లో పాల్గొనేవారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్‌ డిపాజిట్‌ ఆఫ్‌ మనీ ఉంచాలి.కేవైసీ పత్రాలను సదరు బ్రాంచ్‌లో సమర్పించాలి.బిడ్‌లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్దగానీ, మరెవరైనా గుర్తింపు పొందిన ఏజెన్సీ నుంచి కానీ డిజిటల్‌ సిగ్నేచర్‌ తెచ్చుకోవాలి.ఈఎండీ, కేవైసీ పత్రాలు సమర్పించాక బిడ్లో పాల్గొనేవారికి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపిస్తారు.

Thanks for reading Today SBI Mega E-Auction

No comments:

Post a Comment