Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 30, 2021

Village clinics start on August 15: CM Jagan


 పట్టణాల్లో తక్కువ ధరకే స్థలాలు...ఆగస్టు 15న విలేజ్‌ క్లినిక్‌లు ప్రారంభం: జగన్‌

అమరావతి: మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఏప్రిల్‌, మే నెలలో అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టినందుకు ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కొవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికే విలేజ్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. యుద్ధప్రాతిపదికన వాటి నిర్మాణం పూర్తి చేసి ఆగస్టు 15న ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ (బీఎంసీ) సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సెప్టెంబర్‌ నెలలో బీఎంసీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 25 ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూములను గుర్తించాలని.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక యూనిట్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఒక కుటుంబానికి ఒకటే ప్లాటు..

‘‘పట్టణాల్లో తక్కువ ధరకే స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇస్తాం. వివాదం లేని భూములకు క్లీన్‌ టైటిల్‌తో ఇంటి స్థలాలు కేటాయిస్తాం. ఇందుకోసం పట్టణాలు, నగరాల్లో 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలి. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎంఐజీ-1లో 150, ఎంఐజీ-2లో 200, ఎంఐజీ-3లో 240 చదరపు గజాల ప్లాట్లు చేయాలి. ఒక కుటుంబానికి ఒకటే ప్లాటు కేటాయిస్తాం’’ అని సీఎం తెలిపారు.

నేనూ వ్యాక్సిన్‌ తీసుకుంటాను..

‘‘కొవిడ్‌ నివారణపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎల్లుండి నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటాను. వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా చేపట్టడమే మన కర్తవ్యం. దీని ద్వారానే కొవిడ్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యాక వ్యాక్సినేషన్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్బన్‌ ప్రాంతాల తొలిదశ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. వార్డు, గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని ప్రక్రియ చేపట్టాలి’’ అని వివరించారు.

Thanks for reading Village clinics start on August 15: CM Jagan

No comments:

Post a Comment