Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 21, 2021

AP: Good news for EBC women


 ఏపీ: ఈబీసీ మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.45వేలు, అర్హతలు, మరియు పూర్తి వివరాలు.



◆ఈబీసీ నేస్తం పథకం మార్గదర్శకాలు విడుదల

◆బడ్జెట్ కేాటాయింపులపై సర్కార్ ఉత్వర్వులు

◆అర్హతలు, వెబ్‌సైట్ వివరాలు ఇలా ఉన్నాయి

జగన్ సర్కార్ ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణాల మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు రూ.45 వేలు ఇవ్వనుంది.

ఏపీలో అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మహిళలకు చేయూత అందించే ఈబీసీ నేస్తం పథకం అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు.. వారిని ఎలా గుర్తించాలనే అంశాలపై బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణాల మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు రూ.45 వేలు ఇవ్వనుంది. ఈ పథకం కింద 4,02,336 మంది లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదికి రూ.603.5 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.1,810.51 కోట్లు ఈ పథకం అమలుకు ఖర్చవుతుంది. బడ్జెట్‌ కేటాయింపులపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు.. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. మున్సిపల్ ఏరియాలో 750 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్న వాళ్లు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు.. పారిశుద్ధ్య ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. కారు ఉండకూడదు (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉండవచ్చు). కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదు.

ఈ పథకం గురించి ఆదేశం ఇచ్చిన రోజు నుంచి లబ్ధిదారుల వయసును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ navasakam.ap.gov.in ను రూపొందించారు. అర్హుల గుర్తింపు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రక్రియ అంతా దీనిద్వారానే జరుగుతుంది. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. కాపు నేస్తం లబ్ధిదారులు, వైఎస్‌ఆర్‌ చేయూత కింద సాయం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకం వర్తించదు.

గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి అర్హతలున్న వారిని గుర్తిస్తారు. లబ్ధిదారులను గుర్తించి సచివాలయాల్లోని సంక్షేమ సహాయకునికి అందిస్తారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి బీసీ కార్పొరేషన్‌ ఈడీలకు పంపిస్తారు. తుది జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలిపిన అనంతరం బీసీ కార్పొరేషన్‌ ద్వారా నిధులు విడుదలవుతాయి.

Thanks for reading AP: Good news for EBC women

No comments:

Post a Comment