Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 11, 2021

Are you using AC .. Follow these tips and reduce the 'current' bill .. !!


 ఏసీ వాడుతున్నారా .. ఈ చిట్కాలు పాటించి ' కరెంట్ ' బిల్లును తగ్గించుకోండి .. !!

◆వేసవిలో ఏసీ వాడకంలో బీఈఈ సూచనలు

◆24 డిగ్రీలు .. 24 శాతం ఆదా !

వేసవిలో ఎండలతోపాటు విద్యుత్తు బిల్లులూ మండుతుంటాయి. సాధారణంగా బిల్లులో 20 శాతం వరకు పెరుగుదల ఉంటే ఏసీ వాడే ఇళ్లలో ఇందుకు కొన్ని రెట్లు అధికంగా వస్తుంది. ఈ నెలాఖరు నుంచి పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో విద్యుత్తు బిల్లు మోత మోగే అవకాశం ఉంది. ఏసీల వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే 24 శాతం వరకు విద్యుత్తు ఆదా చేసుకోవచ్చని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) పేర్కొంటోంది.

90 శాతం ఇళ్లలో..

నగరంలో ఏసీల వాడకం ఏటేటా పెరుగుతోంది. సొంతిల్లు, అద్దె ఇల్లు అనే తేడా లేకుండా 90 శాతం ఇళ్లలో కేవలం వేసవిలో మాత్రమే ఏసీలను వాడుతున్నారు. ఇంట్లో ఒకటిన్నర టన్ను సామర్థ్యం కలిగిన ఏసీ ఉంటే, కేవలం రాత్రిపూట మాత్రమే వినియోగిస్తే కరెంట్‌ బిల్లు రూ.1,500 వరకు వస్తుంది. రెండు ఏసీలు ఉంటే రూ.2,500 నుంచి 3 వేల వరకు బిల్లు వస్తుంది. సాధారణ రోజుల్లో వీరి బిల్లులు రూ.500లోపే ఉంటాయి. ఏసీ వాడుతూనే కరెంట్‌ బిల్లు తగ్గించుకోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మేలు.

* ఏసీలో ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్తు బిల్లు ఆదా చేసుకోవచ్చు. చల్లదనం కోసం ఎక్కువ మంది 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెడుతుంటారు. కంప్రెషర్‌ ఎక్కువ సమయం నడుస్తుంది. ఫలితంగా బిల్లు పెరుగుతుంది.

* ఏసీని ఎల్లప్పుడూ 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకొంటే కంప్రెషర్‌ తక్కువ సమయం నడుస్తుంది. 24 శాతం వరకు బిల్లు తగ్గుతుంది.

* వార్షికంగా రూ.6,240 వరకు బిల్లుల రూపంలో పొదుపు చేయవచ్చు.


* చాలారోజుల అనంతరం ఏసీ వాడాల్సి వస్తే ముందుగా సర్వీసింగ్‌ చేయించాలి. ఫిల్టర్లు శుభ్రంగా ఉంటే ఎక్కువ గాలి వస్తుంది. కంప్రెసర్‌పై భారం తగ్గుతుంది.


* ఇంట్లోకి నేరుగా ఎండ తగలకుండా కర్టెన్లు, బాల్కనీల్లో మొక్కలతో ఏసీపై భారం తగ్గించి ఆ మేరకు బిల్లు తగ్గించుకోవచ్చు.

రిఫ్రిజిరేటర్లలోనూ ఆదా..

వేసవిలో రిఫ్రిజిరేటర్‌ వినియోగం సైతం ఎక్కువే. పాతవి ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తాయి. కొత్తవి తీసుకోవడం మేలు. పదే పదే ఫ్రిజ్‌ డోర్‌ తీయకుండా అవసరమైనవన్నీ ఒకేసారి తీసుకొని.. ఒకేసారి లోపల సర్దడం ద్వారా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

Thanks for reading Are you using AC .. Follow these tips and reduce the 'current' bill .. !!

No comments:

Post a Comment