Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 25, 2021

Bank Holidays in May 2021


 Bank Holidays in May 2021 : మే లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే.....

మే నెల వచ్చేస్తోంది. మీకు మేలో ఏవైనా బ్యాంకు పనులున్నాయా? అయితే మేలో వచ్చే సెలవుల వివరాలు తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే బ్యాంకుల పనివేళల్ని కుదించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA అన్ని బ్యాంకులకు సూచించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందించాలని కోరింది. దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో బ్యాంకు వేళల్ని తగ్గించాలని కోరింది. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్-SOPs తో పాటు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఐబీఏ సూచించింది. గతేడాది కూడా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బ్యాంకు పనివేళల్ని తగ్గించిన సంగతి తెలిసిందే.

ఈసారి కూడా బ్యాంకు పనివేళలు తగ్గుతున్నాయి. ప్రతీ రోజు నాలుగు గంటలపాటు మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కొన్నివారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. మరోవైపు మేలో బ్యాంకులు 9 రోజులపాటు మూతపడే అవకాశముంది. రెండో శనివారం, నాలుగో శనివారం, ఐదు ఆదివారాలతో పాటు మేడే, రంజాన్ హాలిడే ఉన్నాయి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.

Bank Holidays May 2021: మేలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే

మే 1- మేడే

మే 2- ఆదివారం

మే 8- రెండో శనివారం

మే 9- ఆదివారం

మే 14- రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ

మే 16- ఆదివారం

మే 22- నాలుగో శనివారం

మే 23- ఆదివారం

మే 30- ఆదివారం

మేలో బ్యాంకులు 9 రోజులు మూతపడతాయి. ఇక బ్యాంకులు తెరిచి ఉండే మిగతా రోజుల్లో కూడా బ్యాంకులు రోజూ నాలుగు గంటలపాటే సేవలు అందించే అవకాశం ఉంది. మేలో ముఖ్యమైన లావాదేవీలు జరిపేవారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తమ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకు సేవలు అందుబాటులో లేని సమయంలో మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉపయోగించుకోవచ్చు.

బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.

Thanks for reading Bank Holidays in May 2021

No comments:

Post a Comment