Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 28, 2021

CoronaVaccine: 50% reduction in single dose!


 CoronaVaccine: ఒక్క డోసుతో 50% వ్యాప్తి తగ్గినట్లే!

పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

లండన్‌ : కరోనా వ్యాప్తి విషయంలో ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు కీలక విషయం వెలుగులోకి తెచ్చారు. వ్యాక్సిన్‌.. కరోనా వైరస్‌ నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. 


ఈ మేరకు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌(పీహెచ్‌ఈ) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారిన పడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. దీంతో టీకా వైరస్‌ బారి నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని బ్రిటన్‌ హెల్త్‌ సెక్రటరీ మ్యాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందన్నారు.

Thanks for reading CoronaVaccine: 50% reduction in single dose!

No comments:

Post a Comment