Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 27, 2021

Jobs in State Bank of India (SBI)


 Jobs in State Bank of India (SBI)

అభ్యర్థులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూనియర్‌ అసోసియేట్స్‌ నోటిఫికేషన్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 5,000 ఖాళీలు భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ సర్కిల్లో 275 పోస్టులున్నాయి. కొవిడ్‌ పరిస్థితులతో ప్రభుత్వోద్యోగ ప్రాధాన్యం అభ్యర్థులందరికీ అర్థమైంది. అది సాధించాలంటే తీవ్రమైన పోటీ ఉండే ఈ పరీక్షకు పట్టుదల, అంకితభావం, కష్టపడే తత్వం అవసరం. ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే దీనిలో విజయం సాధించి     బ్యాంకు ఉద్యోగిగా చేరిపోవచ్చు. జీవితంలో చక్కగా స్థిరపడొచ్చు!

బ్యాంకు కొలువుల స్వాగతం!

జూనియర్‌ అసోసియేట్స్, క్లర్క్‌...పేరు మార్పు మినహా రెండింటి బాధ్యతలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల విధులనూ జూనియర్‌ అసోసియేట్స్‌ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన,  ఏప్రిల్‌ 01, 2021 నాటికి 20-28 సంవత్సరాల వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ చదువుతోన్న అభ్యర్థులు కూడా అర్హులే. అయితే వారు 16 ఆగస్టు 2021 లోపు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ పద్ధతిలో  దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్‌) నిర్వహించే ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారిలో పోస్టుల సంఖ్యకు పది రెట్ల మంది అభ్యర్థులు (సుమారుగా 50,000) మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే.

ప్రాంతీయ భాషా పరీక్ష: అభ్యర్థులు తాము ఎంచుకున్న రాష్ట్రం/ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ భాష పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు 10 లేదా 12వ తరగతిలో ఆ భాషను ఒక సబ్జెక్టుగా చదివివున్నట్లయితే ప్రాంతీయ భాషా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వారు ఆ సబ్జెక్టును చదివినట్టుగా తెలిపే సర్టిఫికెట్‌ పొందుపరచాల్సి ఉంటుంది.


మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులకు..

ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లోనే ఉంటుంది. కాబట్టి దీనిలో ఉత్తీర్ణులవడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందోనని మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులందరికీ సందేహం ఉంటుంది. పరీక్ష వరకు ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ప్లాన్‌ చేసుకోవాలి. సబ్జెక్టులను నేర్చుకోవడం (లర్నింగ్‌), సాధన చేయడం (ప్రాక్టీస్‌), మోడల్‌ పేపర్లు రాయడం (టెస్ట్స్‌).. ఇలా 3 రకాలుగా విభజించుకోవాలి. దానికి అనుగుణంగా రోజులో వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ బాగా కష్టపడాలి. ఈ విధంగా ప్రయత్నించి విజయం సాధించిన అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యమే. అయితే పట్టుదల, కష్టపడే తత్వం, ఎలాంటి పరిస్థితులకూ భయపడకుండా ఉండే అభ్యర్థులకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని మాత్రం మరవొద్దు.

సబ్జెక్టులు - అవగాహన

ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో మొత్తం నాలుగు విభాగాల్లో కలిపి ఐదు సబ్జెక్టులుంటాయి. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టును రీజనింగ్‌ ఎబిలిటీ విభాగంతో కలిపి ఉంచారు. ఈ సబ్జెక్టుల్లో పరీక్షలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న టాపిక్‌లను చూద్దాం.

న్యూమరికల్‌ ఎబిలిటీ/ క్వాంట్ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో ఒకే విధమైన ప్రశ్నలు ఉన్నప్పటికీ పరీక్షను బట్టి వాటి స్థాయిలో భేదం ఉంటుంది. సింప్లిఫికేషన్స్‌ (5-10 ప్రశ్నలు), నంబర్‌ సిరీస్‌ (5), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (5-20), డేటా సఫిషియన్సీ/ కంపారిజన్‌ (3-5)ల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. అరిథ్‌మెటిక్‌లోని టాపిక్‌ (పర్సంటేజి, యావరేజి, రేషియో, ప్రాఫిట్‌-లాస్, ఇంటరెస్ట్, టైమ్‌-వర్క్, టైమ్‌-డిస్టెన్స్, మెన్సురేేషన్‌ మొదలైనవి), పర్ముటేషన్స్‌-కాంబినేషన్స్, ప్రాబబిలిటీలో ఒక్కో దాని నుంచి 0-1 ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.

రీజనింగ్‌

ఈ విభాగంలో కోడింగ్‌- డీకోడింగ్‌ (3-5 ప్రశ్నలు), బ్లడ్‌ రిలేషన్స్‌ (3-5), సీక్వెన్స్‌ సిరీస్‌ (1-3), ఇనీక్వాలిటీ (3-5), సిలజిజమ్‌ (5), ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్‌ ( 1-3), డైరెక్షన్స్‌ (1-3), సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ (10-15), పజిల్‌ (10-15)తోపాటు మెయిన్స్‌ పరీక్షలో అనలిటికల్‌/ లాజికల్‌ రీజనింగ్‌లోని స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు (అసమ్షన్స్, కంక్లూజన్, ఆర్గ్యుమెంట్, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్స్, కాజ్‌-ఎఫెక్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్, డేటా సఫిషియన్సీల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఇంగ్లిష్‌

రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఒకాబులరీ, గ్రామర్‌ ఆధారంగా ఉండే ప్రశ్నలుంటాయి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 5-10 ప్రశ్నల వరకు ఉంటాయి. గ్రామర్‌ ఆధారంగా ఉండే స్పాటింగ్‌ ఎరర్స్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, క్లోజ్‌ టెస్ట్‌ లాంటి రెగ్యులర్‌ ప్రశ్నలతోపాటు కొత్త తరహా ప్రశ్నలూ రావొచ్చు. గ్రామర్‌పై అవగాహన ఉంటే దాని ఆధారంగా ఏ తరహా ప్రశ్ననైనా తేలికగా సాధించే అవకాశం ఉంటుంది.

జనరల్‌/ ఫైనాన్స్‌అవేర్‌నెస్‌

 మెయిన్స్‌ పరీక్షలో మాత్రమే ఉండే ఈ విభాగంలో బ్యాంకింగ్, ఆర్థిక సంబంధ ప్రశ్నలతోపాటు వీటికి సంబంధించిన కరంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలుంటాయి. వీటితోపాటు సాధారణంగా అడిగే తాజా వార్తల్లోని ప్రదేశాలు, వ్యక్తులు, పుస్తకాలు, అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలైన వాటినన్నింటినీ పరీక్షకు ముందు 6-8 నెలల వరకు బాగా అవగాహన ఏర్పరుచుకోవాలి.


జూనియర్‌ అసోసియేట్స్‌ విధులేంటి?

ఈ పోస్టులను నోటిఫికేషన్‌లో జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) గా పేర్కొన్నారు. అంటే ఖాతాదారులకు కావాల్సిన సేవలు అందిస్తూ బ్యాంకు అందించే అన్ని రకాల సేవలను (డిపాజిట్లు, రుణాలు, పథకాలు మొదలైనవి) తెలియజేయటం, ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తూ తద్వారా బ్యాంకు ఆదాయం పెంచడం.. దాదాపు బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతలనూ తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీతభత్యాల సంగతి?

రూ.19,900 బేసిక్‌ పేతో మొదలై దేశంలో వారు పనిచేసే ప్రాంతాలను బట్టి మొత్తం నెలసరి వేతనాన్ని నిర్ణయిస్తారు. ముంబయి లాంటి మెట్రో నగరాల్లో అన్ని అలవెన్సులను కలుపుకుని ప్రారంభంలో రూ.29,000 వేతనం పొందే అవకాశం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఇది మారుతుంది. వీటికి అదనంగా వారికి పెర్క్‌లు, ప్రావిడెంట్‌ ఫండ్, పెన్షన్, మెడికల్‌ లాంటి అదనపు ప్రయోజనాలు, సదుపాయాలు ఉంటాయి. అయితే ఏ ప్రాంతంలో పనిచేసినా దాదాపు రూ.22-23 వేల నెల జీతం పొందగలరు.

పదోన్నతులు ఏ విధంగా?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అద్భుతమైన పదోన్నతుల పద్ధతి ఉంది. దీనివల్ల త్వరగా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. పదోన్నతుల కోసం బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులవడం ద్వారా మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకు అంచెలంచెలుగా చేరుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం వారి వయసు, ప్రతిభ తోడ్పాటు అవసరమవుతుంది.

ఇలా సిద్ధం కండి!

ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ 50 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ ఉండే సబ్జెక్టులు దాదాపు ఒకటే కాబట్టి రెండింటికీ సరిపోయేలా ఉమ్మడి ప్రిపరేషన్‌ ఉండాలి. కొత్త అభ్యర్థులైతే ఈ సమయాన్ని నేర్చుకోవడం, ప్రాక్టీస్, టెస్టుల కోసం, పాత అభ్యర్థులైతే ప్రాక్టీస్, టెస్టుల కోసం విభజించుకోవాలి. రోజుకు 12-15 గంటల సమయం కేటాయించుకోవాలి.

టాపిక్స్‌ నేర్చుకోవడంతో సంబంధం లేకుండా మొదటి రోజు నుంచే ప్రతిరోజూ కనీసం ఒక మోడల్‌ పేపర్‌ రాయాలి. దీనివల్ల పరీక్షా విధానానికి అలవాటు పడటమే కాకుండా కొన్ని ప్రశ్నలను సాధించే అవసరం లేకుండా జవాబులను ఎలా గుర్తించవచ్చో తెలుసుకునే నేర్పు అలవడుతుంది. పరీక్షలో సమయం తక్కువ కాబట్టి ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ముఖ్యంగా క్యాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలను వేగంగా సాధించే పద్ధతులపై దృష్టి సారించాలి. షార్ట్‌కట్‌ పద్ధతులు, కాల్‌క్యులేషన్స్‌ వేగంగా చేయగలిగే స్పీడ్‌ మ్యాథ్స్‌ లాంటి మెలకువలను నేర్చుకోవాలి. కొత్త అభ్యర్థులు ముందుగా పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు అడిగే టాపిక్స్‌ను పూర్తిచేయాలి. పూర్వ ప్రశ్న పత్రాలు (ప్రీవియస్‌ పేపర్స్‌) పరిశీలించడం ద్వారా ఏయే టాపిక్స్‌లో ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జూనియ‌ర్ అసోసియేట్‌ (క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌)

మొత్తం ఖాళీలు : 5454

రిజర్వేషన్ ఆధారంగా ఖాళీలు : జ‌న‌ర‌ల్-5000, ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ బ్యాక్‌లాగ్-121, పీడ‌బ్ల్యూడీ-96, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-237.

అర్హత : ఏదైనా విభాగంలో బిఈ / బిటెక్/   డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది / సెమిస్ట‌ర్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వయస్సు : 20 - 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 02.04.1993 - 01.04.2001 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.19,900 - 70,000/-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ ( ప్రిలిమిన‌రీ & మెయిన్స్‌) , లోక‌ల్ లాంగ్వేజ్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 27, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 17 , 2021.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: జూన్, 2021.

మెయిన్స్ ప‌రీక్ష తేది: 31 జూలై 2021.

వెబ్ సైట్ :https://www.sbi.co.in/  

నోటిఫికేషన్: Here

Apply Here

Thanks for reading Jobs in State Bank of India (SBI)

No comments:

Post a Comment