Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 20, 2021

PF balance can be known even without UAN


యూఏఎన్ లేకుండా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చందాదారుల‌కు పెట్టుబడులను మరింత పారదర్శకంగా చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) వివిధ చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఈపీఎఫ్ఓ  వ్యవస్థలో ప‌లుమార్లు స‌వ‌ర‌ణ‌లు చేసింది. ఈపీఎఫ్ఓ ​​చందాదారులు ఇప్పుడు యూఏఎన్‌ సంఖ్య లేకుండా వారి పీఎఫ్‌ లేదా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చూసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ఓ  ​​హోమ్ పేజీ- epfindia.gov.in లో లాగిన్ అవ్వడం ద్వారా ఇది పూర్తి చేయ‌వ‌చ్చు.


 యూఏఎన్‌ లేకుండా పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ ఎలా చేయాలి.?


1. ఈపీఎఫ్ఓ ​​హోమ్ పేజీలో లాగిన్ అవ్వండి - epfindia.gov.in;

2. ‌మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి  'click here to know your PF balance' వద్ద క్లిక్ చేయండి


3.  epfoservices.in.epfo పేజ్ ఓపెన్ అవుతుంది


4. అక్క‌డ  మీ రాష్ట్రం, ఈపీఎఫ్ కార్యాలయం,  కోడ్, పీఎఫ్‌ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి


5. అంగీక‌రిస్తున్న‌ట్లు  'I Agree' పై క్లిక్ చేయాలి


6. అప్పుడు మీకు స్క్రీన్‌పై ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివ‌రాలు క‌నిపిస్తాయి


యూఏఎన్ నంబర్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్:


ఈపీఎఫ్ఓ ​​చందాదారుడికి యూఏఎన్ నంబర్ ఉంటే, అప్పుడు  ఎస్ఎంఎస్‌ లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయ‌వ‌చ్చు. న‌మోదిత మొబైల్ నంబ‌ర్ నుంచి 7738299899 కు  ‘EPFOHO UAN' అని ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఒక ఈపీఎఫ్ఓ ​​చందాదారుడు న‌మోదిత మొబైల్ నంబ‌ర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చూడ‌వ‌చ్చు.

Thanks for reading PF balance can be known even without UAN

No comments:

Post a Comment