Pulse Oximeter: ఎలా ఉపయోగించాలంటే!
ఇంటర్నెట్‌డెస్క్: పల్స్ ఆక్సీమీటర్. ఒకప్పుడు కేవలం వైద్యులు, ఆస్పత్రుల వద్ద మాత్రమే ఉండేది. గతేడాది కరోనా విజృంభణతో దీని గురించి అందరికీ తెలిసింది. కరోనా బారిన పడిన వారిలో ఎక్కువమంది శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ స్థాయిలను సరిగా గుర్తించలేకపోవడంతో మరణాల బారిన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పల్స్ ఆక్సీమీటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
కరోనా ప్రారంభ దశలో హైపోఆక్సిమీయా(రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం) వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పల్స్ ఆక్సీమీటర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 92శాతం కంటే తక్కువగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలి. అసలు పల్స్ ఆక్సీ మీటర్ ఎలా ఉపయోగించాలి?అన్నదానిపై చాలా మందిలో సందేహం ఉంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుని, పల్స్ ఆక్సీమీటర్‌ను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది.
పల్స్ ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలి
* చేతి గోళ్లకు ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని తొలగించాలి.
* చేతులు చల్లగా ఉంటే కాస్త వెచ్చదనం వచ్చేలా చేయాలి.
* ఆక్సీ మీటర్ వేలికి ఉంచే ముందు కనీసం 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
* అనంతరం చేతిని ఛాతిస్థాయికి తీసుకెళ్లి ఉంచాలి.
* చేతి మధ్యవేలు లేదా చూపుడు వేలుకు ఆక్సీమీటర్ ఉంచి స్విచ్ఛాన్ చేయాలి.
* కనీసం నిమిషం పాటు ఆక్సీమీటర్‌ను చేతి వేలికి ఉంచాలి. రీడింగ్ స్థిరంగా చూపించే వరకూ కూడా ఉంచవచ్చు.
* ఆక్సిజన్ స్థాయిల్లో కనీసం ఐదు సెకన్ల పాటు ఎలాంటి మార్పు లేకపోతే దాన్నే అత్యధిక రికార్డుగా నమోదు చేసుకోవాలి.
* ప్రతిసారీ ఎంతో జాగ్రత్తగా ఆక్సిజన్ స్థాయిలను గమనిస్తూ ఉండాలి.
* మొదటి నుంచి ఆక్సిజన్ స్థాయిలను ప్రతి రోజూ ఒకే సమయంలో మూడు సార్లు రికార్డు చేయాలి.
ఊపిరి తీసుకోవడంలో కష్టంగా అనిపించడం, మాట తడబడటం, ఆక్సిజన్ స్థాయి 92శాతం కన్నా తక్కువ ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 1075కు కాల్ చేయండి. లేదా మీ దగ్గరిలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి.
Thanks for reading Pulse Oximeter: How to use!
No comments:
Post a Comment