Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 21, 2021

Who should not take coronavaccine!


 Coronavaccine ఎవరెవరు వేసుకోకూడదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచదేశాల ప్రజలను నిద్ర పట్టకుండా చేసిన కరోనా మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా పలుదేశాలు ఇప్పటికే టీకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టీకాలను ఎవరు వేయించుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మొదటి డోసు టీకాలు తీసుకొని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీకాలు ఎవరికి ఇస్తారు? ఏ వయస్సులో వాళ్లు తీసుకోవడం క్షేమదాయకం? చిన్న పిల్లలకు ఎందుకు టీకాలు ఇవ్వడం లేదు? లాంటి ప్రశ్నలు చాలా మందిని వేదిస్తున్నాయి. వ్యాక్సిన్లు వచ్చాయి కదా అని తొందర పడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.

టీకాలు వేయడానికి సంబంధించి వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరోనా టీకాను వేయించుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే టీకా తీసుకోవాలంటున్నారు. ఒకవేళ  అలర్జీలాంటివేమైనా ఉంటే.. అది తగ్గిన తర్వాతనే టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. బ్లీడింగ్‌ సమస్యలు ఉన్నవారు డాక్టర్లు లేదా వ్యాక్సిన్‌ పంపిణీ దారులనుంచి అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కొవిడ్‌ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా ఏవ్యాక్సిన్‌కైనా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండటం సహజం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కూడా అంతే.. ఒక వేళ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు తీసుకోవాలి.

Thanks for reading Who should not take coronavaccine!

No comments:

Post a Comment