Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 8, 2021

5 types of cash transactions for which you will receive IT notices


 మీకు ఐటీ  నోటీసులు వ‌చ్చే 5 ర‌కాల‌ నగదు లావాదేవీలు

గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను శాఖ, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ సంస్థ‌, బ్రోకరేజీలు వంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లు సాధారణంగా వారి నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా నగదు లావాదేవీలను త‌గ్గించేందుకు కృషి చేస్తున్నాయి. ఇవి నగదు లావాదేవీని ఒక నిర్దిష్ట పరిమితికి అనుమతిస్తాయి. ఈ నిబంధ‌న‌ల ఉల్లంఘన జరిగితే, ఆదాయపు పన్ను శాఖ వారికి నోటీసు పంపవచ్చు.

 అధిక విలువైన నగదు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఆదాయపు పన్ను దీనిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక‌త‌తో  ప‌రిమితికి మించి చేసే లావాదేవీల వివ‌రాలు సుల‌భంగా తెలిసిపోతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్లో నగదును ఉపయోగించి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పెట్టుబడి పెడితే, బ్రోకర్ తన బ్యాలెన్స్ షీట్‌లో పెట్టుబడి గురించి నివేదిస్తాడు. అక్క‌డ లావాదేవీల విష‌యం బ‌య‌ట‌పడుతుంది. కాబట్టి  న‌గ‌దు లావాదేవీల ప‌రిమితిని తెలుసుకొని వ్య‌వ‌హ‌రిస్తే, ఆదాయ ప‌న్ను శాఖ నుంచి నోటీసు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు.

 ఆదాయపు పన్ను నోటీసు పంపే అవ‌కాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

1.పొదుపు / క‌రెంట్ ఖాతా: ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ. 1 లక్ష‌.  పొదుపు ఖాతాలో ఒక ల‌క్ష రూప‌యాల‌కు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాలి.

3.బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్): బ్యాంక్ ఎఫ్‌డీలో నగదు డిపాజిట్  రూ. 10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కు మించి నగదు డిపాజిట్ చేయకూడ‌దు.

4. మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్ లేదా డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు న‌గ‌దు పెట్టుబ‌డులు రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తనిఖీ చేస్తుంది.

5. రియల్ ఎస్టేట్: ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే  ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.

Thanks for reading 5 types of cash transactions for which you will receive IT notices

No comments:

Post a Comment