Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 12, 2021

Antibodies: How many months are there in them!


 Antibodies: వారిలో ఎన్ని నెల‌లుంటాయంటే.!


రోమ్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు కనీసం 8 నెలల పాటు కొనసాగుతాయని ఇటలీ శాస్త్రవేత్తలు మంగళవారం తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, బాధితుల వయసు, ఇతర అనారోగ్య సమస్యలు వంటి అంశాలతో సంబంధం లేకుండానే వీటి స్థాయి ఉంటుందని చెప్పారు. గత ఏడాది కొవిడ్‌-19 మొదటి ఉద్ధృతి సందర్భంగా మిలాన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మంది కరోనా బాధితులపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఈ నిర్ధారణకు వచ్చారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వీరి నుంచి రక్త నమూనాలు సేకరించారు. నవంబరు చివర్లో మరోసారి వాటిని తీసుకున్నారు. ‘‘కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉనికి వీరిలో క్రమేణా తగ్గుతోంది. అయితే వ్యాధి సోకిన 8 నెలల తర్వాత కూడా వాటి ఉనికి ఉంది. అన్ని నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే ఇవి లేవు’’ అని పరిశోధకులు తెలిపారు. బాధితుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకిన 15 రోజుల్లోగా యాంటీబాడీలు ఉత్పత్తి కాకుంటే వారిలో కొవిడ్‌ తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పారు.

Thanks for reading Antibodies: How many months are there in them!

No comments:

Post a Comment