Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 19, 2021

Corona infected people should be vaccinated 3 months after recovering from the virus.


 Covid: కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: వ్యాక్సినేషన్‌ విధానంలో పలు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్‌ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. 


టీకా విధానంలో తాజా మార్పులివే..


* కొవిడ్‌ సోకినవారు కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలి. అంతకుముందు ఇది 4-8 వారాలుగా ఉండేది. ఇప్పుడు దీన్ని 3 నెలలకు పెంచారు. 


* తొలి డోసు వేసుకున్నాక కొవిడ్‌ సోకితే.. కోలుకున్న 3 నెలలకు రెండో డోసు తీసుకోవాలి. 


* ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలి.


* ఇతర తీవ్ర వ్యాధులతో ఆసుపత్రి లేదా ఐసీయూలో చికిత్స అవసరమైన వారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత వ్యాక్సిన్‌ వేసుకోవాలి.  


* బాలింతలు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.


* కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు.


* వ్యాక్సినేషన్‌కు ముందు టీకా తీసుకునేవారికి ఎలాంటి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అవసరం లేదు. 


అయితే గర్భిణీలకు కొవిడ్‌ టీకా అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ విధానంలో తాజా మార్పులను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

Thanks for reading Corona infected people should be vaccinated 3 months after recovering from the virus.

No comments:

Post a Comment