Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, May 20, 2021

Corona tests at home.... the guidelines were issued by ICMR‌


 ICMR: ఇంటి వద్దే కరోనా పరీక్షలు

మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎంఆర్‌ 

 దిల్లీ: పల్లెల్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కార్యాచరణకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది.


🌀 లక్షణాలున్నవారు, ఇప్పటికే పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహిత సంబంధం ఉన్న వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ చేయాలి. విచక్షణారహితంగా పరీక్షలు నిర్వహించకూడదు.


🌀గూగుల్‌ప్లేలో ఉన్న హోం టెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో పేర్కొన్న నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి. రోగికి పాజిటివ్, నెగెటివ్‌ టెస్ట్‌ ఫలితాలు అందించాలి.


🌀 పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి ఉపయోగించిన టెస్ట్‌ స్ట్రిప్‌ను మొబైల్‌యాప్, యూజర్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ఫోన్‌లో ఫొటో తీయాలి.


🌀 మొబైల్‌ఫోన్‌ యాప్‌లో నమోదు చేసిన డేటాను కేంద్రీకృత సర్వర్‌లో భద్రంగా నిల్వచేస్తారు. ఆ సర్వర్‌ ఐసీఎంఆర్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ పోర్టల్‌కు అనుసంధానమై ఉంటుంది. అంతిమంగా డేటా అంతా ఇందులోనే నిల్వ ఉంటుంది.


🌀ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులంతా 100% పాజిటివ్‌గానే భావించాలి. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారంతా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలి.


🌀లక్షణాలు ఉన్నప్పటికీ ర్యాట్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారు వెంటనే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. తక్కువ వైరల్‌ లోడ్‌ ఉన్నవారి గుర్తించడంలో ర్యాట్‌ పరీక్షలు విఫలమయ్యే అవకాశం ఉన్నందున నెగెటివ్‌ వచ్చిన వారు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు వెళ్లాలి.


🌀లక్షణాలున్నా ఇందులో నెగెటివ్‌ వచ్చిన వారిని అనుమానిత కొవిడ్‌ రోగులుగా పరిగణించి వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లమని చెప్పాలి. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితం వచ్చేంతవరకు వారు దాన్ని అనుసరించాలి.

Thanks for reading Corona tests at home.... the guidelines were issued by ICMR‌

No comments:

Post a Comment