Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 22, 2021

Find out the oxygen level in the phone itself!


 ఫోన్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండిలా!

కోల్‌కతా: కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను గడగడలాడిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే దీని తీవ్రత అధికంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు పెరిగిపోయాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్‌గా మన ఫోన్‌లోని ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా!? ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’. కోల్‌కతాకు చెందిన ‘కేర్‌ నౌ హెల్త్‌కేర్‌’ అనే అంకుర సంస్థ దీనికి రూపకల్పన చేసింది.


ఎలా పనిచేస్తుందంటే..

ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌ పనిచేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం మన ఫోన్‌లోని ఫ్లాష్‌ ఆధారంగా ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను తెరచి మన ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసి వెనుక కెమెరాపై మన వేలిని ఉంచాలి. తర్వాత స్కాన్‌ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్‌, పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామని ఆయన తెలిపారు. అందులో ఈ యాప్‌ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని వెల్లడించారు.


డౌన్‌లోడ్‌ ఇలా....


ఈ యాప్‌ ప్రస్తుతం ఐవోఎస్‌ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో ఏపీకేను అందుబాటులోకి ఇచ్చారు. త్వరలో ప్లే స్టోర్‌లోకి తీసుకొస్తారని సమాచారం. అలాగే సింగిల్‌ యూజర్‌ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వివరాలు కేర్‌నౌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

Thanks for reading Find out the oxygen level in the phone itself!

No comments:

Post a Comment