Highlights of the AP Cabinet meeting @ 04.05.21

అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలకంగా చర్చించారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ఎలా అమలు చేయాలి? విధివిధానాలేంటి? అనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. సరిపడా పడకలు లేక కొందరు చనిపోతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కొరతను ఎలా అధిగమించాలనే అంశంపైనా చర్చించారు. సుమారు 50 వేల బెడ్‌ల వరకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఆక్సిజన్ సమస్యపై చర్చ జరగ్గా.. తగిన ఆక్సిజన్ ఉన్నప్పటికీ రవాణాకు ట్రక్కుల కొరత వేధిస్తోందని, అందుకే సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ అందడంలో జాప్యం జరుగుతున్నట్టు మంత్రులు సీఎంకు తెలిపినట్టు సమాచారం. దీంతో విదేశాల నుంచి కూడా ట్రక్కులు కొనుగోలు చేయాలనే అంశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
మరోవైపు వ్యాక్సినేషన్ అంశంపైనా కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేందుకు వీలుగా నిధుల కేటాయింపుపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో టీకా కొరత ఉండటంతో భారీగా కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లపైనా చర్చించారు. వీటితో పాటు రెమిడెసివర్ ఇంజెక్షన్ల కొనుగోళ్లపైనా చర్చ జరిగింది. టూరిజం శాఖకు సంబంధించి పలు అంశాలపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
★ వ్యాక్సినేషన్‌పై ప్రధానికి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం.
★ 45 ఏళ్లు పైబడ్డవారికి వ్యాక్సినేషన్‌లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం.
★ ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి తీర్మానం.
★ ఎలక్ట్రానిక్ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై నిర్ణయాలు.
★ రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం.
★ వైయస్ఆర్ ఉచిత భీమా పథకానికి కేబినెట్ ఆమోదం.
★ రూ .2,589 కోట్లతో వైయస్సార్ ఉచిత భీమా పథకం అమలు.
★వైయస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం.
★ మత్స్యకారులకు రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని మంత్రి మండలి నిర్ణయం..
★ బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం.
★ అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు.
★ బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు.
★ ఈనెల 13న రైతు భరోసా తొలి విడత జమ.
★ వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10వేలు పరిహారం.
★ ప్రభుత్వ పాఠశాలల్లో 7వ నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధన.
★ 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో చదువుకుని, పరీక్ష రాస్తారు.
★ రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు.
★ నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం.
★ ఏపీలో సహకార డెయిరీలు అమూల్‌కు లీజు. మొత్తం 708 గ్రామాల్లో అమూల్ సేవలు.
★ అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేల గౌరవ వేతనం పెంపు.
★ బి కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం
★ ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపు.
★ మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల గౌరవ వేతనం.
Thanks for reading Highlights of the AP Cabinet meeting @ 04.05.21
No comments:
Post a Comment