Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 3, 2021

Highlights of the review meeting with CM Jagan, Ministers and officials.


 Highlights of the review meeting with CM Jagan, Ministers and officials.

వైద్య ఆరోగ్య శాఖను అత్యంత ప్రాధాన్యత శాఖగా తీసుకువాలని, ఆ శాఖకు ఎట్టి పరిస్ధితుల్లో నిధులు కొరత రానివ్వవద్దని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ శాఖ పరిధిలో నాడు - నేడు కింద ఆస్పత్రుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే న్యాయ సమీక్ష పూర్తి చేసి టెండర్లు నిర్వహించిన మెడికల్ కళాశాలల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. వైఎస్​ఆర్ కంటి వెలుగు కింద వృద్ధులకు వెంటనే కళ్లద్దాలను పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో నాడు - నేడు, వైయస్సార్‌ కంటి వెలుగు పథకంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జ్యుడీషియల్‌ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో వెంటనే పనులు ప్రారంభం కావాలన్నారు. అలాగే ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల కోసం భూసేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడాలని సీఎం సూచించారు.


నిధులు కొరత ఉండొద్దు...

వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, దీనికి సంబంధించి నిధుల కొరత అనేది లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం.. కాలేజీలకు సంబంధించి టెండర్లు అవార్డు అయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతుందని తెలిపారు.


జాప్యం జరగకూడదు....

వైయస్సార్‌ కంటి వెలుగు పథకపై సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్ల అద్దాల పంపిణీ చేయడంతో పాటు.. అవసరమైన వారికి ఆపరేషన్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో ఎటువంటి జాప్యం జరగకూడదని, అధికారులు తప్పనిసరిగా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. పథకంలో ఇప్పటి వరకు 66,17,613 మంది స్కూల్‌ పిల్లలకు పరీక్షలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వారిలో కంటి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 293 పిల్లలకు ఆపరేషన్లు కూడా చేయించామన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 వేల393 స్కూళ్లను కంటి వెలుగు పథకంలో చేర్చామన్నారు. కళ్ళద్దాలు అవసరమైన 1,58,227 మంది పిల్లలకు ఉచితంగా అద్దాలు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు. పథకం మూడో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 9వేల 262 మంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేశామని తెలిపారు. వారిలో 3 లక్షల 90 వేల 479 మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చామని వివరించారు. మరో 41 వేల 193 మందికి ఆపరేషన్లు చేయించగా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

Thanks for reading Highlights of the review meeting with CM Jagan, Ministers and officials.

No comments:

Post a Comment