Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, May 20, 2021

IT Returns Deadline Extension


 IT returns: ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు

దిల్లీ: కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్‌ వేళ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) వెల్లడించింది. వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్‌ 31గా సీబీడీటీ గడువు ఉండేది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది.


ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లును సుల‌భ‌త‌రం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.in ను తీసుకొచ్చింది. జూన్‌ 7 నుంచి ఈ కొత్త పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. అయితే, జూన్‌ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్‌ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని ఐటీ శాఖ పేర్కొంది.




Thanks for reading IT Returns Deadline Extension

No comments:

Post a Comment