Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 22, 2021

Lessons taught by covid..how to be at home ..?


 Covid నేర్పిన పాఠాలు..ఇల్లు ఎలా ఉండాలంటే..?

కొవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో సొంతిల్లు ఎంత అవసరమో తెలిసేలా చేస్తే.. రెండో ఉద్ధృతిలో  ఎలాంటి ఇల్లు అవసరమో గుర్తించేలా చేసిందంటున్నారు నిర్మాణదారులు. కొవిడ్‌ భయాలు.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఇంటికే పరిమితం అవుతున్నారు.. నాలుగు గోడల మధ్య కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఇంటి నిర్మాణం ఉండాలి. కరోనా ఒక్కటే కాదు ఇతరత్రా అనారోగ్యాల బారిన పడకుండా ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన వెంటిలేషన్‌ తప్పనిసరి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నా, నిర్మాణం పూర్తైన ఇంటిని కొనుగోలు చేస్తున్నా ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.


రెండు పడక గదులు..

విశాలమైన ఇళ్లలో ఉన్న వారిలో కొవిడ్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కనీసం రెండు పడక గదుల సొంత ఇల్లు ఉండాలనే అవసరాన్ని కొవిడ్‌తో చాలామంది గుర్తించారు. పిల్లలకు ఇంటి నుంచి పాఠాలు, పెద్దలకు ఇంటి నుంచే పనితో స్థోమతను బట్టి మూడు, నాలుగు పడక గదుల ఇళ్లు, విల్లాలకు మారిపోయిన వారు ఉన్నారు. విశాలమైన ఇళ్లలో గాలి, వెలుతురు వచ్చేలా ఉంటాయి.


రెండు కిటికీలు...

పాత రోజుల్లో ప్రతి గదికి రెండు కిటికీలు ఉండేవి. ఒక దాంట్లోంచి ఇంట్లోకి గాలి వస్తే.. మరో దాంట్లోంచి బయటికి వెళ్లేందుకు నిర్దేశించేవారు. దీంతో గదిలోని వేడి గాలి ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోయేది. ఒకటే కిటికీ ఉంటే పైభాగంలో వెంటిలేటర్‌ బిగించేవారు. దీంతో వేడిగాలి గది పైభాగంలో చేరి వెంటిలేటర్‌ నుంచి బయటికి వెళ్లేది. వేసవిలోనూ గదులు చల్లగా ఉండేవి. ప్రస్తుతం వెంటిలేటర్ల ఊసే లేదు. ఒక కిటికీ అయినా సరే గదిలోకి తగిన గాలి, వెలుతురు వచ్చే దిక్కులో ఏర్పాటు చేసుకుంటే మంచిది. పగటిపూట కిటికీలు తెరుచుకున్నా ప్రైవసీకి భంగం కలగకుండా సౌకర్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.


స్నానాల గదులు...

ఇదివరకు చూస్తే స్నానాల గది ఇంటి మధ్యలో సైతం ఉండేవి. హోటళ్లు,  ఆసుపత్రుల గదుల మాదిరి మధ్యలో స్నానాలగదిని నిర్మించి పైనుంచి వెంటిలేషన్‌ ఏర్పాటు చేసేవారు. అయినా బాత్రూమ్‌ చీకటిగా ఉండేది. కామన్‌వాల్స్‌ ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఉండేది. బహుళ అంతస్తుల భవనాల్లో ఈ సమస్య లేదిప్పుడు. బయటి నుంచి తగిన వెలుతురు, గాలి వచ్చేలా గది బయటి వైపు నిర్మిస్తున్నారు. స్నానాల గదుల్లో చీకటి ఉంటే దుర్వాసన వెదజల్లడం, రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌చేరి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత ఇళ్లలో స్థలాభావంతో స్నానాల గదులు ఇరుకిరుకుగా, చీకటిగా ఉంటున్నాయి. వీటి నిర్మాణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


మన దగ్గర చాలా వరకు హరిత భవనాలే

దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే  హైదరాబాద్‌లో 2006 తర్వాత నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు అత్యధికం హరిత భవనాల కిందకే వస్తాయని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌, హైదరాబాద్‌ ఛాప్టర్‌ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అప్పట్లో తీసుకొచ్చిన జీవో నంబరు 86 కారణమన్నారు. వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ.. అప్పటి వరకు ఉన్న నిబంధనలను మార్పులు చేయడంతో కామన్‌ వాల్స్‌ అనేవి లేకుండా పోయాయి.  ప్రవేశ ద్వారం వైపు తప్ప ఫ్లాట్‌కు మిగతా మూడువైపులా ఖాళీ స్థలమే ఉంటుంది. దీంతో ఇంట్లో అన్ని గదుల్లో తగిన వెలుతురు, గాలి ఉంటోంది. అంతర్గతంగా గాలి నాణ్యత మెరుగ్గా ఉండటంతో త్వరగా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు.

Thanks for reading Lessons taught by covid..how to be at home ..?

No comments:

Post a Comment