Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 5, 2021

The only exception to the curfew is for these sectors.


 కర్ఫ్యూ నుంచి ఈ రంగాలకు మాత్రమే మినహాయింపు...

రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి.. ప్రభుత్వం ఈ నెల 18 వరకు కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి ఈనెల 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ నుంచి పలు విభాగాలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది


రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈనెల 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. కర్ఫ్యూ నుంచి పలు విభాగాలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చిన రంగాలివీ..

✯కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు

✯ కర్ఫ్యూ నుంచి టెలికామ్‌, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపు

✯కర్ఫ్యూ నుంచి బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లకు మినహాయింపు

✯ కర్ఫ్యూ నుంచి విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు

✯నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు

✯ కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు

✯ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్‌కు మినహాయింపు

రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని సూచించింది. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనుమతినిచ్చింది. తప్పనిసరివివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆంక్షలు పెట్టింది. రోజంతా 144 సెక్షన్ అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కరోనా ఆంక్షలు అమలుచేయాలని కలెక్టర్లు, విభాగ అధిపతులకు ఆదేశించింది.

Thanks for reading The only exception to the curfew is for these sectors.

No comments:

Post a Comment