AP News: EAPCET instead of EAMCET in AP
ఏపీలో! ఎంసెట్‌కు బదులుగా ఈప్‌సెట్!
"EAPCET"(Engineering, Agriculture, Pharmacy Common Entrance Test)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బదులుగా ఈఏపీ సెట్(EAPCET) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈఏపీ సెట్ ను నిర్వహించనున్నట్లు వివరించారు. నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదల చేస్తామని.. 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
జులై 26 నుంచి ఆగస్టు 5 వరకు రూ.500, ఆగస్టు 6 నుంచి 10 వరకు రూ.1000, జులై 11 నుంచి 15 వరకు రూ.5000, ఆ నెల 16 నుంచి 18 వరకు రూ.10 వేల ఆలస్య రుసుములతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ మొదటి, రెండు వారాల్లో ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్ సెట్, పీసెట్ నిర్వహణకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
Thanks for reading AP News: EAPCET instead of EAMCET in AP!
No comments:
Post a Comment