Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 2, 2021

If sign a white paper and take a loan and refuse to repay ..! What to do ..?


 వైట్ పేపర్‌పై సంతకం చేసి అప్పు తీసుకుని .. తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే .. ! ఏం చేయాలి .. ?



అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం. అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది అభివృద్ధికి దోహదం చేస్తుంది. అప్పు తీసుకొనేవారు అప్పు ఇచ్చిన వ్యక్తికి వ్రాసి ఇచ్చే నోటును ప్రామిసరి నోట్ అంటారు. అప్పు ఇచ్చినందుకు వచ్చే ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు. కొంత సమయంలో తిరిగి చెల్లించే వడ్డీ లేని రుణాన్ని చేబదులు అంటారు. ఇదిలావుంటే ; ఒకరికొకరు సహాయపడటం మానవ ప్రవర్తనలో భాగం. ఇందులో మాట సహాయం.. ఆర్థిక సహాయం ఇవి మానవ సంబంధాల్లో చాలా ముఖ్యమైనవి.

ఇక బ్యాంక్ ఇచ్చే డబ్బును రుణం అంటారు. క్రెడిట్ స్కోర్ చూసిన తర్వాతే బ్యాంకులు ఎవరికైనా రుణం అందిస్తాయి. ఇలా కాకుండా బంగారం లేదా ఏదైనా ఆస్తి హామీగా పెట్టుకుని తనఖా రూపంలో అప్పు ఇస్తాయి. అదే విధంగా, చాలా మంది భూమిని లేదా ఇంటికి సంబంధించిన పత్రాలను తనఖా పెట్టడం ద్వారా డబ్బు ఇస్తుంటారు.

ఇలా కాకుండా; స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు మొదలైన వారికి నమ్మకంపై (ట్రస్ట్‌పై) మాత్రమే రుణాలు ఇస్తుంటారు. ఇలాంటి చాలా సందర్భాల్లో రుణం స్టాంపు పేపర్‌ మీద కాకుండా సాదా కాగితంపై సంతకాన్ని తీసుకుని ఆర్ధిక సహాయం చేస్తుంటారు. ఇలా అరువు తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కొందరు ఇబ్బందులు పెడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్యలో ఉన్న నమ్మకం వీగి పోతుంది.

ఇప్పుడు మనం అసలు విషయంకు వచ్చేద్దాo, ఎవరైనా మీ నుంచి సాదా కాగితంపై సంతకం చేసి డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే; ఏదైన పరిష్కారం ఉందా..? ఇలాంటి సమయంలో ఎలాంటి పరిష్కారం ఉంది..? నిపుణులు ఏమంటున్నారు..? ఒక సారి మనం పరిశీలిద్దాం..ఇలాంటి వారి నుంచి డబ్బులు తిరిగి పొందేందుకు కొంత పోరాడాల్సి ఉంటుంది.

ఇలాంటి వివాదం వచ్చినప్పుడు ఏం చేయాలో ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తు్న్న శుభం భారతీ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా వివరాలను అందించారు. సాదా కాగితం లేదా స్టాంప్ పేపర్.. ఈ రెండింటిలో ఎక్కడైన రుణగ్రహీత సంతకం ఉంటే అప్పుడు మీరు మీ డబ్బు కోసం న్యాయ పోరాటం చేయవచ్చు.

మీ రుణగ్రహీత నుండి సంతకాన్ని పొందడం ద్వారా మీరు రుజువు చేసినప్పటికీ, మీ ఇద్దరి మధ్య వ్రాతపూర్వక ఒప్పందం జరిగిందని అర్థం. అంటే మీ డబ్బుకు రుణగ్రహీత నుంచి తీసుకున్న రశీదుగా భావించాల్సి ఉంటుంది.


సివిల్ కోర్టులో కేసు

వ్రాతపూర్వక ఒప్పందం ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని మీ రుణగ్రహీత అంగీకరించడానికి నిరాకరిస్తే మీరు అతనిపై సివిల్ కోర్టులో కేసు పెట్టవచ్చు. ఇలాంటి కార్యకలాపాలను సివిల్ లేదా సివిల్ ప్రొసీడింగ్స్ అంటారు.

సివిల్ కోర్టులో సివిల్ కేసులు మాత్రమే నమోదు చేయబడతాయి. మీ కేసులో తీర్పు ఇవ్వడానికి ఎన్ని రోజుల్లో అనేది మాత్రం కోర్టుపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తే, మీ రుణగ్రహీత మీ డబ్బును తిరిగి ఇవ్వాలి. అయితే, ఇందులో అతనికి జైలు లేదా పెద్ద శిక్ష కూడా పడవచ్చు.

పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు లేదా కోర్టులో ఫిర్యాదు కేసు!

ఎవరో చెప్పినదానిపై ఆధారపడి చాలా మంది ముందు రుణాలు ఇస్తుంటారు. అంటే, మీరు సాదా కాగితంపై సంతకం చేయలేదని..రాసిన కాగితంను చదవకుండా రుణం ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అతను డబ్బు తిరిగి ఇవ్వడం లేదు.. అప్పుడు ఏమి చేయాలి?

ఈ పరిస్థితిలో రుణం ఇచ్చే సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఇద్దరిని 2 సాక్షులను మీరు సమర్పించవచ్చు. మీరు మీ సమీపంలోని ఏదైనా పోలీస్ స్టేషన్‌లో వారిపై రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం నేరపూరితంగా మారుతుంది.

డబ్బు తిరిగి ఎలా పొందాలి?

కోర్టులో నేరం రుజువైతే రుణగ్రహీత శిక్ష పడుతుంది. అంతే కాదు అరెస్టు కూడా చేయవచ్చు. కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే.. మీ డబ్బు కూడా తిరిగి ఇవ్వబడుతుంది. అయితే, నిర్ణయం రాకముందే రుణగ్రహీత మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తే.. తప్పకుండా తీసుకోండి. ఎన్ని రోజుల్లో ఇస్తాడో అడగండి.. ఆ విషయాన్ని రాతపూర్వకంగా హామీ పత్రం రాసుకోవడం ఉత్తమం. మీ డబ్బు అంతా తిరిగి వచ్చిన తర్వాతే మీరు కేసును ఉపసంహరించుకోవాలి. కేసులో రాజీ పడాలంటే, రాజీ పిటిషన్‌ను మళ్లీ కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. రెండు పార్టీల నుండి అభ్యంతరం లేకపోతే కోర్టు కేసును కొట్టివేస్తుంది. మీరు మీ డబ్బును తిరిగి పొందుతారు..ఇదే ఉత్తమమైన మార్గం.

Thanks for reading If sign a white paper and take a loan and refuse to repay ..! What to do ..?

No comments:

Post a Comment