నేవీలో ఉద్యోగాలు
పరిమిత కాల సేవల ప్రాతిపదికన ఇండియన్ నేవీ అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్నవారు అర్హులు. అకడమిక్ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారిని శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందుకోవచ్చు.
జనరల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్)లో 47, హైడ్రోగ్రఫీలో 3 ఖాళీలు ఉన్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఐనెట్ నిర్వహించడం లేదు. అకడమిక్ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కులతో పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలకు సన్నద్దమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో విజయం సాధించినవారికి నేవల్ అకాడెమీ, ఎజిమాళలో జనవరి 2022 నుంచి 44 వారాలపాటు తర్ఫీదునిస్తారు. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారికి లెవెల్ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. ప్రొబేషన్ వ్యవధి రెండేళ్లు. వీరు గరిష్ఠంగా 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగవచ్చు.
అర్హత: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: జనవరి 2, 1997 - జులై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు: జూన్ 26 వరకు స్వీకరిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: జులైలో.
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా.
వెబ్‌సైట్: https://www.joinindianavy.gov.in/
Thanks for reading Jobs in the Navy
No comments:
Post a Comment