Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 8, 2021

Revised Vaccination Guidelines


Revised Vaccination Guidelines

టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను కేంద్రం వెలువరించింది. రాష్ట్రాల జనాభా, వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా డోసుల పంపిణీ ఉంటుందని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కో డోసుకు రూ.150కి మించకుండా సర్వీస్ ఛార్జీ వసూలు చేయవచ్చని పేర్కొంది.

దేశ ప్రజలందరికీ టీకా ఉచితంగా అందిస్తామని చెప్పిన కేంద్రం.. ఇందుకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జనాభా, వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ పురోగతి అంశాల ఆధారంగా టీకా డోసుల పంపిణీ ఉంటుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది. టీకా వృథా అధికంగా ఉంటే డోసుల పంపిణీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది.తమకు అందిన డోసులను బట్టి.. టీకా ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. జూన్ 21 నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని తెలిపింది. టీకా పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకు ముందుగానే సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి టీకా ధరను తయారీదారులే నిర్ణయిస్తారని కేంద్రం వెల్లడించింది. ఒక్కో డోసుకు రూ.150కి మించకుండా సర్వీస్ ఛార్జీ వసూలు చేయవచ్చని పేర్కొంది.

చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌.. ఏర్పాట్లకు ఆదేశాలు 

కొవిడ్ మూడో ముప్పు(Covid third wave) దృష్ట్యా ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్(Vaccination ) కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లుల జాబితాను సిద్ధం చేయాలని వైద్యారోగ్య శాఖ(ap health department) అధికారులను ఆదేశించింది. 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్ వేయాలన్న నిబంధన నుంచి వెసులుబాటు కల్పించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతోంది. వ్యాక్సినేషన్ ముందురోజే ఆశా వర్కర్లు(ASHA WORKERS), ఎఎన్​ఎమ్​(ANM) ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది.

Download.. Revised Vaccination Guidelines 

Thanks for reading Revised Vaccination Guidelines

No comments:

Post a Comment