జులై చివరిలో పది , ఇంటర్ పరీక్షలు
సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
బోర్డు పరీక్షల నిర్వహణతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే. పరీక్షల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించింది. వాటి నిర్వహణపై వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది.
Saakshi....
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వేర్వేరు రోజుల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రతి విద్యార్థికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, భౌతిక దూరం, శానిటేషన్ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. విద్యార్థుల ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉంటాయని అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రభుత్వం .. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు సుప్రీంకు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహణకు కోర్టు అనుమతి ఇవ్వాలని అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
కాగా ఏపీలో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షల రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని తెలిపింది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని ఏపీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాగా విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు అడిగింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తూ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం పేర్కొన్నారు. పరీక్షలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో పరీక్షల అవసరం, వాటి నిర్వహణ కోసం చేపట్టబోయే చర్యల గురించి తెలియచేశామన్నారు
Thanks for reading The AP government filed the affidavit in the Supreme about 10th and inter examinations
No comments:
Post a Comment