Vaccination Sunday : రేపు మెగా వ్యాక్సినేషన్ .. 10 లక్షల టీకా డోసులు
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 20న 'వ్యాక్సినేషన్ సండే'(Vaccination Sunday) పేరిట సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టి గరిష్ఠస్థాయిలో ప్రజలకు టీకా డోసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఒక్క రోజులోనే 8 నుంచి 10 లక్షల డోసులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ముందస్తుగా 14 లక్షల డోసుల వ్యాక్సిన్లను వివిధ జిల్లాలకు సరఫరా పూర్తి చేశారు. దీనిలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు.
వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రయత్నిస్తోంది. ఒక్కరోజే 8 నుంచి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 'వ్యాక్సినేషన్ సండే'(Vaccination Sunday) పేరిట.. ఈ నెల 20న అత్యధిక మందికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రికార్డు తిరగరాసేందుకు ప్రణాళిక..
ఇప్పటికే అత్యధికంగా 6 లక్షల డోసులను ఒక్కరోజులోనే వేసిన రికార్డును రాష్ట్రం సొంతం చేసుకోగా.. రేపు 10 లక్షల డోసుల వ్యాక్సిన్ వేసి మరో రికార్డును సొంతం చేసుకోవాలని మెగా డ్రైవ్ తో(Megha vaccination drive) ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 14 లక్షల వ్యాక్సిన్ డోసులను జిల్లాలకు సరఫరా కూడా పూర్తిచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు వైద్యారోగ్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారందరికీ తొలిడోసుతో పాటు రెండో డోసు వ్యాక్సిన్ను వేయనున్నారు.
ఇప్పటిదాకా ఇచ్చిన డోసుల వివరాలు..
వీటితో పాటు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా టీకా అందించనున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోటీ 22 లక్షల 83 వేల 479 డోసుల వ్యాక్సిన్ను ప్రజలకు వేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 26 లక్షల 41 వేల 739 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తవగా.. 70 లక్షల మందికి ఒక్క డోస్.. 5 లక్షల 29 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ పూర్తైనట్లు ప్రకటించారు.
ఏ డోసులు ఎన్నంటే..?
రాష్ట్రంలో ఇప్పటివరకూ కోటీ 1 లక్షా 17 వేల 825 డోసులు కోవిషీల్డ్, 21 లక్షల 65 వేల 654 కోవాగ్జిన్ డోసులను ప్రభుత్వం వేసింది. ప్రస్తుతం 45 ఏళ్ల వయసుండి వ్యాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1 కోటీ 33 లక్షల మందికి టీకా వెేయాల్సి ఉందని పేర్కొంది. అలాగే ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు రాష్ట్రంలో మెుత్తం 18 లక్షల 70 వేల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
Thanks for reading Vaccination Sunday: Mega vaccination tomorrow .. 10 lakh vaccine doses
No comments:
Post a Comment