Aging Problem : ఈ 5 ఐటెమ్స్ తింటే త్వరగా ముసలితనం రావడం ఖాయం
కాలాన్నీ, వయసునూ ఆపలేం. రెండూ పెరుగుతూనే ఉంటాయి. కానీ... ముసలితనాన్ని వాయిదా వేయవచ్చు. కొంత మంది 50 ఏళ్ల నుంచే ముసలివారైపోతూ ఉంటాయి. కొంతమందికి 80 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం వాళ్లు తినే ఆహారమే. మనం తినే పదార్థాలకూ, మన శరీరం, ఆరోగ్యానికీ సంబంధం ఉంటుంది. వయసులో ఉన్నప్పటి నుంచే సరైన ఆహారం తింటూ ఉంటే... త్వరగా ముసలితనం రాదు. వచ్చినా అనారోగ్యాలు పెద్దగా ఉండవు. అలాంటి పరిస్థితి రావాలంటే... డాక్టర్లు 5 రకాల పదార్థాల్ని తినడం మానేయమంటున్నారు. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు గానీ... రెగ్యులర్‌గా మాత్రం వాటిని తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.
Burger-Pizza: ఇది మనందరికీ తెలిసిన విషయమే.పిజ్జాలు, బర్గర్లూ టేస్టీగా ఉంటాయి గానీ... ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తాయి. ఇవి మన చర్మంపై ఉండే కాంతిని పూర్తిగా పోగొడతాయి. అంతేనా బాడీలో పార్టులకు కొవ్వును అతికిస్తాయి. ఫలితంగా పొట్ట వచ్చేస్తుంది. దాని చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది వస్తే చాలు... చాలా రోగాలు వచ్చేందుకు దారి తీస్తుంది. ఫాస్ట్ ఫుడ్ ఎంత తింటే... అంతలా ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి. ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. దాన్ని ఎంత తగ్గిస్తే... అంతలా మీరు ముసలితనానికి దూరమవుతారని డాక్టర్లు చెబుతున్నారు.
Pastries / Cakes: కేక్‌లు, పాస్ట్రీలు, ఫ్యాట్స్... ఇవన్నీ... మనలో కొవ్వును పెంచుతాయి. కొవ్వు ఎంత పెరిగితే... ముసలి తనం అంత త్వరగా వస్తుంది. సో, వాటికి దూరంగా ఉండాలి.
Excess fat and salt in chips: చిప్స్ బాగా ఇష్టంగా తింటారా? ఒక్కసారి ఆలోచించండి. వాటిని ఫ్యాట్ నూనెలో వేపుతారు. సాల్ట్ ఎక్కువగా వాడుతారు. అలాంటివి తింటే... ఆరోగ్యం పాడైపోతుంది. అవి మీకు తెలియకుండానే మీ బాడీలో పార్టుల్ని నాశనం చేసి... ముసలితనం త్వరగా వచ్చేలా చేస్తాయి.
Smoking and drinking: మద్యం తాగడం, స్మోకింగ్ వంటివి కూడా ముసలితనానికి దారి వెతుకుతాయి. బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అది చర్మంపై ప్రభావం చూపి... ముడతలు వచ్చేలా చేస్తుంది.
Cold Drinks: ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు తాగడం మానేయడం మేలు. వాటి బదులు ఫ్రూట్ జ్యూస్‌లు తాగితే మేలు. ఇలాంటి డ్రింక్స్ కూడా బాడీలో నీటిని కోల్పోయేలా చేస్తాయి. వీటిలోని కెఫైన్... శరీరానికి హాని చేస్తుంది. త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తుంది.
Thanks for reading Aging Problem: By eating these 5 things you will quickly become old
No comments:
Post a Comment